iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ నయా గోల్డెన్ లెగ్.. అస్సలు వదలట్లేదుగా

టాలీవుడ్ నయా గోల్డెన్ లెగ్.. అస్సలు వదలట్లేదుగా

సినిమా వాళ్లకు సెంటిమెంట్లు కాస్త ఎక్కువే, సినిమా ముహూర్తం మొదలు రిలీజ్ డేట్ వరకు ప్రతి విషయంలోనూ సెంటిమెంట్ ఫాలో అవుతూనే ఉంటారు. మరీ ముఖ్యంగా కొన్ని కాంబినేషన్లు అలాగే హీరోయిన్ ల లక్ విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయరు దర్శకనిర్మాతలు. ఎవరైనా హీరోయిన్ ఒక సినిమాతో వచ్చి హిట్ కొట్టగానే ఆమె వెంట పడుతూ ఉంటారు దర్శకనిర్మాతలు. ప్రస్తుతానికి తెలుగులో బడా సినిమాల మేకర్స్ అందరూ పూజా హెగ్డే, రష్మిక మందన్నా లాంటి హీరోయిన్ ల వెంట పడుతుంటే ఆ తర్వాత ఓ మోస్తరు సినిమాలన్నీ ఈ మధ్య హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఉప్పెన సినిమాతో హిట్ కొట్టిన కృతి శెట్టి ఖాతాలోకి వెళ్ళి పోతున్నాయి. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సాన అనే దర్శకుడు దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన సినిమా ద్వారా కన్నడ భామ కృతి శెట్టి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో బేబమ్మ పాత్రలో ఆమె నటించమంటే జీవించి తెలుగు ప్రేక్షకులకు నచ్చేసింది.

Also Read: పాత జ‌గ‌దీష్

దీంతో పట్టుమని 19 ఏళ్ళు కూడా దాటని ఈ భామ ఇప్పుడు తెలుగు సినిమా దర్శక నిర్మాతలకు గోల్డెన్ లెగ్ గా, ఒక సెంటిమెంట్ గా మారిపోయింది. చిన్న సినిమాలు రూపొందించాలని ఎవరు అనుకుంటున్నా సరే హీరోయిన్ గా ఆమెను ఆన్ బోర్డ్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మొదటి సినిమా సూపర్ హిట్ అందుకున్న కృతి శెట్టి కూడా ఆ సినిమాలో కొత్త నటుడితో నటించిన రెండో సినిమా నుంచి మాత్రం ఆమె ఆచితూచి సినిమాలు ఒప్పుకుంటుంది. ఇప్పుడు ఆ భామ చేతిలో ఏకంగా నాలుగు సినిమాలు ఉండగా ఇప్పుడు నితిన్ తో ఐదో సినిమా మొదలు పెట్టింది. ఇప్పటికే కృతి శెట్టి, నాని సరసన హీరోయిన్ గా శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబు హీరోగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నాగార్జున నాగచైతన్య హీరోలుగా వస్తున్న బంగార్రాజు, రామ్ పోతినేని లింగుస్వామి డైరెక్షన్ లో వస్తున్న సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా ఆమె నితిన్ హీరోగా ప్రారంభమైన సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపికయింది. ఎడిటర్ శేఖర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాని నితిన్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. నితిన్ కెరీర్ లో 31వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాతో మళ్లీ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ఎందుకంటే భీష్మ సినిమాతో హిట్ అందుకున్న నితిన్ ఆ తర్వాత వచ్చిన చెక్, రంగ్ దే సినిమాలతో ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పుడు మళ్లీ ఈ ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. కృతి శెట్టి హీరోయిన్ గా తీసుకున్న వారిలో సుధీర్ బాబు విషయాన్ని పక్కన పెడితే మిగతా హీరోలు అందరూ హిట్ కోసం పరితపిస్తున్న వారే. సుధీర్ బాబు కూడా ఇటీవల వచ్చిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో మంచి మార్కులు కొట్టేశాడు. మరి ఈ కన్నడ భామ గోల్డెన్ లెగ్ హీరోలందరి ఫేటు ఎంత మేర మారుస్తుందో చూడాలి మరి.

Also Read: సీటిమార్ రివ్యూ

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet