ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ మద్ధతుదారులు ఏకగ్రీవాలపై నానా యాగీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ.. ఈ అంశంపై హైకోర్టుకు కూడా వెళ్లింది. ఆది నుంచి చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలపై అభ్యంతరాలు, విమర్శలు చేస్తున్న టీడీపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదులు చేసింది. తాజాగా పంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా పుంగనూరు, ప్రభుత్వ చీఫ్ విప్ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గమైన గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఏకగ్రీవాలపై […]
తొలి విడత పంచాయతీల పోలింగ్‌కు మరో గంటలు సమయం ఉన్న నేపథ్యంలో ఏకగ్రీవమైన పంచాయతీలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యధికంగా ఏకగ్రీవాలు జరిగాయన్న కారణంతో చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవమైన పంచాయతీలపై తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ డిక్లరేషన్ ప్రకటించొద్దని రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లను ఆయా పంచాయతీలపై సమగ్ర నివేదిక కోరారు. దీంతో చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవమైన 177 పంచాయతీల సర్పంచ్ […]
చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలు తాత్కాలికంగా పెండిగ్‌లో ఉంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆదేశాలు జారీ చేయడం పంచాయతీ ఎన్నికల్లో తాజా అంశం. ఈ నిర్ణయం తీసుకోవడానికి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చెప్పిన కారణం.. ఆ రెండు జిల్లాల్లో ఎక్కువగా ఏకగ్రీవాలు అయ్యాయని. ఇంతకు మించి మరే కారణం ఆయన చెప్పలేదు. నిమ్మగడ్డ చూపించిన కారణం సహేతుకంగా ఉందా..? ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయం వల్ల కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం కాకూడదా..? […]