తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పూర్వ పాలక మండలి తీసుకున్న అన్ని నిర్ణయాలపై సమగ్ర దర్యాప్తు చేయించాలని ప్రస్తుత పాలక మండలి నిర్ణయించింది. చంద్రబాబు ప్రభుత్వ హాయంలో పాలక మండలి తీసుకున్న నిర్ణయాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని ఈ రోజు జరిగిన పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు. టీటీడీ ఆస్తులు, భూములు అమ్మకూడదని తీర్మానించారు. ఎక్కడైనా ఆస్తులు ఆన్యాక్రాంతమవుతూ అమ్మకం తప్పనిసరి అయితే స్వామిజీలతో కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. తిరుమలలో పాత భవనాల ఆధునికీకరణ కోసం […]