ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా ప్రజలని జాగ్రత్తలు తీసుకోమని ఆదేశాలు జారీచేసింది. ఏపీలో ఉన్నట్టుండి భారీ వర్షాలు మొదలయ్యాయి. పిడుగులు పడనున్నాయి, వర్షాలు మరింతగా పడతాయని వాతావరణశాఖ అధికారులు తెలుపుతున్నారు. విశాఖ,అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు, సురక్షితమైన భవనాల్లో […]