iDreamPost
android-app
ios-app

భారీ వర్షాలు.. నీట మునిగిన దుబాయ్!

  • Published Nov 18, 2023 | 2:56 PM Updated Updated Nov 18, 2023 | 2:56 PM

ఎంత ఎండ అయినా భరిస్తారు కానీ.. వర్షం వస్తే మాత్రం ఉక్కిరి బిక్కిరి అవుతారు. భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమంయ అవుతుంటాయి.. దీంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్థం అవుతుంది.

ఎంత ఎండ అయినా భరిస్తారు కానీ.. వర్షం వస్తే మాత్రం ఉక్కిరి బిక్కిరి అవుతారు. భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమంయ అవుతుంటాయి.. దీంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్థం అవుతుంది.

భారీ వర్షాలు.. నీట మునిగిన దుబాయ్!

యూనైటెడ్ అరబ్ ఎమిరెట్స్ లో అస్థిర వాతావరణం ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. పలు చోట్ల భారీ వర్షాల కారణంగా ప్రజా జీవనం పూర్తిగా స్థంభించి పోయింది. గురువారం రస్ అల్ ఖైమాలో ప్రారంభమైన భారీ వర్షాలు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపించడంతో పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఎంతోమంది యూఏపీ నివాసితులు భారీ వర్షాల కారణంగా కష్టాలు పడుతున్నారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే దుబాయ్ వీధులు నదులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు దుబాయ్ పోలీసులు నివాసితులకు ఎట్టి పరిస్థితుల్లోను ఇళ్లు వదిలి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. దుబాయ్‌లోని పలు ప్రాంతాలు నీట మునిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

దుబాయ్ లో గత మూడు రోజుల నుంచి కుండ పోత వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల కారణంగా ఎంతో ప్రశాంతంగా ఉండే దుబాయ్ వీధులన్నీ పూర్తగా జలమయం అయ్యాయి. దీంతో జాతీవయ వాతావరణ కేంద్ర ఎల్ల, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో దుబాయ్ పోలీసులు నివాసితులకు ఫోన్ లలో మెసేజ్ లు పంపుతున్నారు. వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఎమిరెట్స్ లో రోడ్డు, వైమానిక రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మెరుపులతో కూడిన వర్షం పడటంతో రోడ్డు మార్గంలో వాహనాలు, విమానాలు పూర్తిగా స్థంభించిపోయాయి. భారీ వర్షాల కారణంగా దుబాయ్ లో వివిధ ప్రాంతాల్లో వరద నీరు దిగ్భందం చేసినట్లు కనిపిస్తుంది. ఒక రకంగా చిన్నపాటి చెరువులు, కుంటలను తలపిస్తున్నాయి.

దుబాయ్ పాఠశాలపై వర్షాలు ప్రభావం పడింది. దీంతో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడకూడదని ఆన్ లైన్ లెర్నింగ్ కు ఆదేశించారు. ఉమ్ అల్ ఖువైన్, అజ్మాన్, రస్ అల్ ఖైమాలోని అధికారులు రిమోట్ లెర్నింగ్ చేట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దుబాయ్ లోని అబు హెల్ లో భారీ వర్షం కురిసిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దుబాయ్ ఐకానిక్ బుర్జ్ ఖలీఫా వద్ద సందడి పూర్తిగా తగ్గిపోయింది. మరోవైపు భారీ వర్షాల ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. నీటి సరఫరా, డ్రైనేజ్ క్లియరెన్స్ వంటి సమస్యలను పరిష్కరించే పనిలో పడిది. ఏది ఏమైనా భారీ వర్షాల కారణంగా ఇక్కడి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.