కాసేపటికే భారీ వర్షం, మరికాసేపటికే ఎండ, మళ్ళీ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు! రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడీ వింత వాతావరణం కనిపిస్తోంది. మరో మూడు వారాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. నైరుతి రుతుపవనాలకు అల్ప పీడనం తోడవడంతో రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూడు వారాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని […]
తెలంగాణలో అయిదు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు ఇప్పట్లో ఆగేలా లేవు. రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావారణ విభాగం తెలిపింది. ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, అసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, కొత్తగూడెం, వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మూడు రోజుల భారీ వర్షాలతో, విద్యాసంస్థలకు మూడు రోజుల సెలవులను పొడిగించారు. […]
భారీ వర్షాల మధ్య తెలంగాణ విద్యాసంస్థలకు మూడు రోజుల సెలవు ప్రకటించింది. ఒడిశా సమీపంలో ఏర్పడిన అల్పపీడనం, దక్షిణ ఒడిశా నుంచి ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 14 వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి […]
దేశంపైనే కుండపోత వర్షం కురుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అవసరమైతే తప్ప బైటకు రావద్దని తెలంగాణ ప్రజలకు అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రలో చాలాచోట్ల రాత్రంత వర్షం కురిసింది. మళ్లీ సాయంత్రానికి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు భారీ వర్షాలను తట్టుకోవడానికి విపత్తు నివారణ సంస్థలతో కలసి పనిచేస్తున్నాయి. ఇక, మహారాష్ట్రలో కనీసం 130 గ్రామాలు నీటిలో చిక్కుకున్నాయి. 128 గ్రామాలతో కమ్యూనికేషన్ తెగిపోయింది. అందుకే మహారాష్ట్రతోపాటు […]