మన విధానాన్ని ప్రత్యర్థి పాటిస్తే.. అదే పెద్ద విజయం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయి. ప్రజలు వైసీపీ ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలపై ఎంతో సంతృప్తితో ఉన్నారు. ఆయా పథకాలు ప్రారంభించిన సమయంలో వాటిని హేళన చేస్తూ టీడీపీ నేతలు మాట్లాడుతున్నా.. ఆ తర్వాత ఆయా పథకాల ప్రాముఖ్యతను, ప్రజల్లో వస్తున్న ఆధరణను గుర్తించకుండా ఉండలేకపోతున్నారు. వైఎస్ జగన్సర్కార్ పథకాలనే రాబోయే ఎన్నికల్లో పేర్లు మార్చి.. పరిధి […]
అధికార పార్టీ నేతలపై ఫిర్యాదులు, అధికారులపై చర్యలు తీసుకుంటూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ తీరు వివాదాస్పదమవుతోంది. పరిధికి మించి వ్యవహరిస్తూ, అధికారులతోపాటు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని కూడా పదవి నుంచి తొలగించాలని గవర్నర్కు సిఫార్సు చేయడం నిమ్మగడ్డ వ్యవహారించే తీరు ఎలా ఉందో తెలుపుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆడమన్నట్లు నిమ్మగడ్డ రమేష్కుమార్ ఆడుతున్నారనే విమర్శలను వైసీపీ నేతల నుంచి ఎదుర్కొంటున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు […]
మేనిఫెస్టో.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో తెలిపే రాజకీయ పార్టీల ప్రమాణ పత్రం. ఈ మేనిఫెస్టోకు తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైన అనుబంధమే ఉంది. 2014లో అధికారంలోకి రావడానికి టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దాదాపు 650 హామీలే ప్రధాన కారణం కాగా.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయని ఘనతను చంద్రబాబు పార్టీ సొంతం చేసుకుంది. అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో.. చివరికి తమ మేనిఫెస్టోను […]