సూపర్ స్టార్ రజనీకాంత్ నటన నుంచి రిటైర్ కాబోతున్నారనే వార్త గత రెండు మూడు రోజులుగా ఓ మీడియా వర్గంలో బాగానే తిరుగుతోంది. పెద్దన్న తెలుగులో భారీ డిజాస్టర్ అయినప్పటికీ తమిళంలో కమర్షియల్ గా నష్టాలు రాకుండా గట్టెక్కింది. అలా అని సినిమా అభిమానులకు విపరీతంగా నచ్చేసిందని కాదు. తలైవా ఇమేజ్ మీద ఉన్న గౌరవం అది. రాజకీయాలకు ఎప్పటికీ రానని గతంలోనే రజని ప్రకటించిన నేపథ్యంలో సినిమాలు తప్ప ఆయనకు మరో ప్రపంచం ఉండదు. కమల్ […]