iDreamPost
android-app
ios-app

Super Star Rajinikanth : సూపర్ స్టార్ తెరకు సెలవు – ఇదీ నిజం

  • Published Nov 19, 2021 | 1:45 PM Updated Updated Nov 19, 2021 | 1:45 PM
Super Star Rajinikanth : సూపర్ స్టార్ తెరకు సెలవు – ఇదీ నిజం

సూపర్ స్టార్ రజనీకాంత్ నటన నుంచి రిటైర్ కాబోతున్నారనే వార్త గత రెండు మూడు రోజులుగా ఓ మీడియా వర్గంలో బాగానే తిరుగుతోంది. పెద్దన్న తెలుగులో భారీ డిజాస్టర్ అయినప్పటికీ తమిళంలో కమర్షియల్ గా నష్టాలు రాకుండా గట్టెక్కింది. అలా అని సినిమా అభిమానులకు విపరీతంగా నచ్చేసిందని కాదు. తలైవా ఇమేజ్ మీద ఉన్న గౌరవం అది. రాజకీయాలకు ఎప్పటికీ రానని గతంలోనే రజని ప్రకటించిన నేపథ్యంలో సినిమాలు తప్ప ఆయనకు మరో ప్రపంచం ఉండదు. కమల్ హాసన్, నాగార్జున, చిరంజీవి లాగా టీవీ యాంకరింగ్ చేయలేరు. వయసు, ఆరోగ్యం దృష్ట్యా అవి రిస్క్ అవుతాయి కూడా. సో హీరోగానే సెలవు తీసుకోవాలి.

విశ్వసనీయ సమాచారం మేరకు రజినీకాంత్ కు ఇప్పటికిప్పుడు రిటైర్ అయ్యే ఆలోచనలో లేరు. పైపెచ్చు వీలైనంత న్యూ జనరేషన్ దర్శకులతో సినిమాలు చేయాలని ప్లాన్ చేసుకున్నారు. పెద్దన్న ఫలితం ఎలా ఉన్నా తనను వింటేజ్ స్టైల్ లో చూపించిన సిరుతై శివ టేకింగ్ నచ్చి ఆయనకే మరో అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారట. ఒకవేళ సూర్యతో ప్రాజెక్ట్ కనక సెట్ కాకపోతే శివ మళ్ళీ రజిని కోసం కథను సిద్ధం చేస్తారు. సో ఈ లెక్కన సూపర్ స్టార్ ని ఇంకొన్ని సార్లు తెరమీద చూడొచ్చు. కానీ ఆయనలో ఎనర్జీ ఎంత ఉన్నా తరచు ఆరోగ్యం దెబ్బ తింటోంది. పలుమార్లు అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్న సందర్భాలు ఉన్నాయి.

ఫ్యాన్స్ మాత్రం తమ హీరో డబుల్ సెంచరీ చేయాలని కోరుకుంటున్నారు. ఇంకో ఇరవై సినిమాలు చేయడం అంటే మాటలు కాదు. ఏడాదికి ఒకటి మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడు రజని వయసు చూసుకుంటే అలా చేయలేరు. ఒకవేళ అమితాబ్ బచ్చన్ తరహాలో సపోర్టింగ్ రోల్స్ కి వచ్చి కుర్ర హీరోలతో కలిసి నటిస్తే నెంబర్ ని చేరుకోవచ్చు కానీ సోలో హీరోగా మాత్రం చాలా కష్టం. ఏది ఏమైనా నరసింహా, బాషా, అరుణాచలం రేంజ్ బ్లాక్ బస్టర్ ఒకటి పడితే మరోసారి తలైవా స్టామినా బాక్సాఫీస్ కు తెలిసి వస్తుంది. కాలాలు దర్బార్ లు ఓపెనింగ్స్ తేవొచ్చేమో కానీ గర్వంగా చెప్పుకునే సక్సెస్ దక్కితే ఆ కిక్కే వేరు

Also Read : Raashi Khanna : రాశి ఖన్నా ఇన్నింగ్స్ స్పీడందుకుంది