Swetha
కొన్నేళ్ల నుంచి నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అభిమానులు ఎదురుచూస్తున్నారు. అతి త్వరలో అని అంటూనే ఉన్నారులే కానీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు. ఒకానొక సమయంలో అసలు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడా రాడా అనే సందేహాలు కూడా ప్రేక్షకులలో తలెత్తాయి. కానీ అవన్నీ ఉత్తిత్తి మాటలే అని .. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి మోక్షజ్ఞ శిక్షణ కూడా మొదలుపెట్టాడనే న్యూస్ వైరల్ అయింది.

కొన్నేళ్ల నుంచి నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అభిమానులు ఎదురుచూస్తున్నారు. అతి త్వరలో అని అంటూనే ఉన్నారులే కానీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు. ఒకానొక సమయంలో అసలు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడా రాడా అనే సందేహాలు కూడా ప్రేక్షకులలో తలెత్తాయి. కానీ అవన్నీ ఉత్తిత్తి మాటలే అని .. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి మోక్షజ్ఞ శిక్షణ కూడా మొదలుపెట్టాడనే న్యూస్ వైరల్ అయింది. ఇక ఇప్పుడు త్వరలోనే ఆ తంతు జరగబోతుందట.
పోయిన సంవత్సరం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మొదటి మూవీని అనౌన్స్ చేశారు. బాధ్యత అంతా ప్రశాంత్ వర్మదే అని చాలానే ఎలివేషన్స్ ఇచ్చారు. కానీ అనుకోకుండా దానికి బ్రేక్ పడింది. సరే తర్వాత ఏమైనా స్టార్ట్ చేస్తారులే అనుకుంటే అది కంప్లీట్ గా ఆగిపోయిందనే న్యూస్ తెలిసింది.ఆ తర్వాత స్వయంగా బాలకృష్ణ ఆదిత్య 999 ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దానిలో మోక్షజ్ఞ మెయిన్ లీడ్ లో నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇది ఎప్పటినుంచో వినిపిస్తున్న వార్తే అయినా ఈ మధ్య ఈ సినిమా కార్య రూపం దాల్చుతున్నట్లు తెలుస్తుంది.
ఈ బాధ్యత మాత్రం క్రిష్ కు అప్పగించారట. సో ఈసారి ఈ సినిమాతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వడం ఖాయం. ప్రస్తుతం ఈ యంగ్ హీరో తన క్యారెక్టర్ కు తగినట్టు మేక్ ఓవర్ అవ్వడంతో బిజీగా ఉన్నారట . సో కొత్త సంవత్సరంలో మోక్షజ్ఞ సినిమా స్టార్ట్ అవ్వడం ఖాయం. ఈ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు ఎప్పుడో స్క్రిప్టు రెడీ చేశారు. ఇక అది క్రిష్ చేతుల మీదుగా సెట్స్ మీదకు వెళ్లడమే బ్యాలెన్స్ . ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.