iDreamPost
android-app
ios-app

2026 లో బాక్స్ ఆఫీస్ ను ఊరిస్తున్న బడా ప్రాజెక్ట్స్

  • Published Dec 31, 2025 | 5:17 PM Updated Updated Dec 31, 2025 | 5:17 PM

ఈరోజుతో 2025 అయిపోతుంది. ఈ ఏడాది ఎలా చూసుకున్న టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు కాస్త నష్టమే జరిగింది. బాగా ఆడతాయి అనుకున్న సినిమాలు ఆడకపోవడం .. ఊహించని చిన్న సినిమాలు కొద్దో గొప్పో ఆనందాన్ని కలిగించడం జరిగింది . సరే ఇదంతా ఇప్పుడు గతం.. ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. 2026 లో బాక్స్ ఆఫీస్ ను ఊరిస్తున్న బడా ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయి.

  • Published Dec 31, 2025 | 5:17 PMUpdated Dec 31, 2025 | 5:17 PM
2026 లో బాక్స్ ఆఫీస్ ను ఊరిస్తున్న బడా ప్రాజెక్ట్స్

ఈరోజుతో 2025 అయిపోతుంది. ఈ ఏడాది ఎలా చూసుకున్న టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు కాస్త నష్టమే జరిగింది. బాగా ఆడతాయి అనుకున్న సినిమాలు ఆడకపోవడం .. ఊహించని చిన్న సినిమాలు కొద్దో గొప్పో ఆనందాన్ని కలిగించడం జరిగింది . సరే ఇదంతా ఇప్పుడు గతం.. ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. 2026 లో బాక్స్ ఆఫీస్ ను ఊరిస్తున్న బడా ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయి. సంక్రాంతికి వచ్చే సినిమాల సంగతి అలా ఉంచితే ఆ తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

అందులో ఫస్ట్ చెప్పుకోవాల్సింది. రామ్ చరణ్ బుచ్చిబాబు పెద్ది సినిమా గురించే. ఈ సినిమా మార్చి 26న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు టీం. ప్రస్తుతం ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. చరణ్ ను బుచ్చి బాబు ఏ విధంగా చూపిస్తాడా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా మీద బాగానే హైప్ క్రియేట్ చేస్తున్నాయి . ఆ తర్వాత అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ గురించే చర్చలు జరుగుతున్నాయి. అదెలాఉండ‌బోతోంది? బ‌న్నీలో అట్లీ చూపించ‌బోతున్న కొత్త యాంగిల్ ఏమిటి? అనే క్యూరియాసిటీ ప్రేక్షకులలో రోజు రోజుకి పెరిగిపోతుంది.

ఇక రీసెంట్ గా విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ సమ్మర్ కి రిలీజ్ కూడా అని చెప్పారు . సో ఇది ఎలా ఉండబోతుందనేది చూడాలి . ఇక ప్రభాస్ ఎవరితో చేసిన అది సెన్సేషన్ ఏ. అదే సందీప్ రెడ్డి తో చేస్తే ఇక అది రా అండ్ రస్టిక్ గా ఉండడం ఖాయం అది కూడా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఏ. కాకపోతే ఇది 2026 లో అయితే రాదు. అలాగే ఎవరు ఎప్పుడు ఊహించని మరో ఫ్యాన్ బాయ్ శ్రీకాంత్ ఓదెల – చిరంజీవి కాంబినేషన్ . వాటితో పాటు ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్ కూడా హైప్ ఉన్న ప్రాజెక్ట్ ఏ. ఇలా కొన్ని కాంబినేషన్స్ 2026 టాలీవుడ్ ను ఊరిస్తూ ఉన్నాయి .