ప్రతి రెండుమూడేళ్లకు ప్రేక్షకుల అభిరుచులు డిమాండ్లు మారిపోతున్న ప్రస్తుత తరుణంలో ఒక హీరోయిన్ దశాబ్దంన్నర పాటు పరిశ్రమలో టాప్ ప్లేస్ లో కొనసాగడం చిన్న విషయం కాదు. అందులోనూ హీరోలకు ధీటుగా తనకంటూ సోలో మార్కెట్ ని సృష్టించుకోవడం అందరి వల్లా సాధ్యమయ్యేది కాదు. సూపర్ తో అనుష్కను పరిచయం చేసినప్పుడు నాగార్జున కానీ పూరి జగన్నాధ్ కానీ తను ఇంత స్థాయికి చేరుకుంటుందని ఊహించారో లేదో కానీ స్వీటీ అని అభిమానులు ముద్దుగా పిలిచే అనుష్క […]