iDreamPost
android-app
ios-app

నాగార్జున వెనుక ఉన్న ఈ నటుడు ఎవరో తెలుసా? ఇద్దరిదీ “సూపర్” కాంబో!

ఈ ఫోటోలో కింగ్ నాగార్జున వెనుక నిలబడ్డ యువకుడ్ని చూశారా..? అతడు కూడా స్టారే. ఏ హీరో వెనుక అయితే నించున్నాడో.. ఆ తర్వాత అదే నాగార్జునకు ఓ హిట్ అందించాడు. ఇంతకు అతడు ఎవరంటే..?

ఈ ఫోటోలో కింగ్ నాగార్జున వెనుక నిలబడ్డ యువకుడ్ని చూశారా..? అతడు కూడా స్టారే. ఏ హీరో వెనుక అయితే నించున్నాడో.. ఆ తర్వాత అదే నాగార్జునకు ఓ హిట్ అందించాడు. ఇంతకు అతడు ఎవరంటే..?

నాగార్జున వెనుక  ఉన్న ఈ నటుడు ఎవరో తెలుసా? ఇద్దరిదీ “సూపర్” కాంబో!

ఈ ఫోటోలో ఇద్దరు స్టార్స్ ఉన్నారని తెలుసా..? అదేంటీ నాగార్జున మాత్రమే ఉన్నాడు కదా అనుకుంటున్నారా..? కింగ్ వెనుక చారల షర్ట్ వేసుకుని నిలబడ్డ బ్యాగ్రౌండ్ ఆర్టిస్టు కూడా స్టారే. అప్పుడు నాగ్ వెనక నిలబడ్డ ఇతడే.. కొన్ని సంవత్సరాల తర్వాత అదే హీరోతో సినిమా తీసి.. బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. అతడే టాలెంట్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఈ స్టిల్ శివ చిత్రంలోనిది. విలన్ రఘువరన్ బ్యాచ్‌లో ఒకరిగా కనిపించాడు పూరీ. డైరెక్టర్ కాకముందు శివ మూవీలో జూనియర్ ఆర్టిస్టుగా మెరిశాడు. ఈ పిక్‌ను గతంలో రామ్ గోపాల్ వర్మ పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతుంది. పూరీ జగన్నాథ్ ఆర్జీవీ శిష్యుడన్న సంగతి తెలిసిందే. వర్మ దగ్గర దర్శకుడిగా పాఠాలు నేర్చుకుని.. బద్రీ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు.

ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం మూవీతో ఈ డైరెక్టర్ ఎవర్రా, ఇంత బాగా మూవీ తీశాడు అనిపించుకునేలా చేశాడు పూరీ. ఇడియట్, అమ్మనాన్న తమిళమ్మాయితో రవితేజను స్టార్ హీరోగా మార్చేసిన ఘనత ఈ డైరెక్టర్‌కే చెల్లుతుంది. ఆ తర్వాత నాగార్జునతో శివ మణి సినిమా తీసి.. బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. ఈ ఇద్దరి నుండి సూపర్ మూవీ కూడా వచ్చింది. పోకిరీ అయితే ఇప్పటికే ఫైనల్ ట్విస్ట్ ఎవ్వరు మర్చిపోలేరు. దేశ ముదురు, బుచ్చిగాడు, నేనింతే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటికంటూ సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఇక అమితాబ్‌ను బద్దా హోగా తేరా బాప్ చిత్రంతో హిట్ అందించాడు. బిజినెస్ మ్యాన్, హార్ట్ ఎటాక్, టెంపర్, పైసా వసూల్ చిత్రాలు ఉన్నాయి. మధ్య మధ్యలో ప్లాప్ సినిమాలు ఇచ్చినప్పటికీ హిట్ మూవీతో వస్తూనే ఉన్నాడు.

Puri jagannadh in siva movie

బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, రామ్, అల్లు అర్జున్, గోపీచంద్, రానా, వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ హీరోలను డైరెక్ట్ చేశాడు. హిందీలో అమితాబ్ బచ్చన్‌ను సరికొత్త యాంగిల్లో చూపించిన దర్శకుడు కూడా పూరీ జగన్నాథే. బద్రీ మొదలుకుని, ఇప్పుడు వచ్చిన డబుల్ ఇస్మార్ట్ వరకు టేకింగ్ స్టైల్లో పస తగ్గలేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత లైగర్ డిజాస్టర్ అయ్యింది. తాజాగా విడుదలైన డబుల్ ఇస్మార్ట్ కూడా అదే బాట పట్టింది. దీంతో ఆయన ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అవుతున్నారు. కొంత మంది అయితే విమర్శలు చేయడం స్టార్ చేశారు. ఇప్పుడంటే పూరీ సక్సెస్ లేక వెనకబడ్డాడేమో కానీ.. తెలుగు సినిమా దశను మార్చేసిన దర్శకుల్లో ఈ స్మార్ట్ డైరెక్టర్ కచ్చితంగా ఉంటాడు. బౌన్స్ బ్యాక్ కావడం అతడికి కొత్తేమీ కాదు. మళ్లీ మరో సినిమాతో తన స్టామినా ఏంటో చూపిస్తాడని ఆశిద్దాం.