ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రివర్స్ స్వింగ్ కనిపిస్తోంది. సహజంగా అవినీతి వ్యవహారాలపై దర్యాప్తు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తుంటాయి.. పాలకపక్షాలు జాప్యం చేస్తుంటాయి. కానీ ఏపీలో మాత్రం అధికార పక్షం విచారణల పర్వం కొనసాగిస్తోంది. విపక్షం దానిని తప్పుబడుతోంది. కక్ష సాధింపు చర్యగా వర్ణిస్తోంది. దానికి కారణం కూడా లేకపోలేదు. గత ప్రభుత్వ విధానాలపై గంపగుత్తగా దర్యాప్తు సాగించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడంతో కలకలం సాగుతోంది. చివరకు ఎటు మళ్లుతుందోనననే ఉత్కంఠ కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో […]