పరువునష్టం కేసులో కోర్టుకు హాజరుకాకుండా ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఎడిటర్ శ్రీనివాస్‌లు తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పలు వాయిదాలకు హాజరుకాకపోవడంతో వారికి వారెంట్ జారీ చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం న్యాయస్థానమే చొరవ తీసుకుంది. గతేడాది కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, ఎడిటర్ శ్రీనివాస్‌లపై పరువునష్టం వ్యాజ్యం దాఖలైంది. నిరాధారమైన వార్తలు రాసి తన పరువుకు నష్టం కలిగించారని జగ్గయ్యపేటకు చెందిన ఎం. సైదేశ్వరరావు స్థానిక కోర్టులో […]
ఢిల్లీ నుండి రంగంలోకి దిగిన ఐటి ప్రత్యేక బృందాలు ఇప్పుడు టిడిపి అధినేత గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పి.శ్రీనివాస్, లోకేష్ సన్నిహితుల ఇళ్లు, సంస్థలపై గురువారం మొదలైన ఐటి సోదాలు వరుసగా ఐదో రోజైన సోమవారం కూడా కొనసాగుతున్నాయి. విజయవాడలోని శ్రీనివాస్ ఇంటితోపాటు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉంటున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు చెందిన అవెక్సా కార్పొరేషన్, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ ఇళ్లల్లో నిరంతరాయంగా సోదాలు కొనసాగుతూనే […]
తన వారికి చీమ కుట్టినా ప్రతిపక్షాల కుట్ర అంటూ ప్రెస్మీట్లు పెట్టి గంటలు గంటలు ఉపన్యాసాలు దంచే మాజీ సీఎం చంద్రబాబు.. ఇప్పుడు తన బినామీలపై వరసపెట్టి రోజుల తరబడి ఐటీ దాడులు జరుగుతుంటే మాత్రం నోరు విప్పడం లేదు. నాకేమీ తెలియదు.. నేనేమీ చూడలేదన్నట్లు మౌనం వహిస్తున్నాడు. చాలా సంవత్సరాల పాటు తన వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన శ్రీనివాస్, కిలారు రాజేశ్, నరేష్ చౌదరి,కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇళ్లపై నాలుగు రోజులుగా ఏకధాటిగా ఐటీసోదాలు […]
తాను నిప్పులాంటి వాడినని, ఏనాడు అవినీతి జోలికి పోలేదని,చేతికి వాచ్, ఉంగరం కూడా లేనివాడినని పదేపదే చెప్పే చంద్రబాబు నాయుడి మాజీ పీఏ ఆస్తి రూ.150 కోట్లు ఉండొచ్చని అంచనా. గురువారం హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడి మాజీ పీఏ శ్రీనివాస్ ఆస్తుల మీద ఆదాయపు పన్నుశాఖ దాడులు చేయగా ఈ భారీ ఆస్తులు, ఇళ్లు, భూములు, షాపింగ్ కాంప్లెక్స్ లు, కంపెనీలు వెలుగు చూశాయి. ఒంగోలు జిల్లాకు చెందిన శ్రీనివాస్ గత పాతికేళ్లుగా […]
ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మాజీ పర్సనల్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఇంటిపై IT అధికారులు ఇవాళ (గురువారం) ఉదయం నుండి దాడులు నిర్వహిస్తున్నారు. శ్రీనివాస్ చంద్రబాబు వద్ద సుధీర్ఘ కాలం పాటు పీఏగా పనిచేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఓటమిపాలైన తర్వాత శ్రీనివాస్ తిరిగి తన స్వంత డిపార్ట్మెంట్ అయిన సాధారణ పరిపాలన శాఖకు (జేఈడీ)కి వెళ్లిపోయారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో, తర్వాత చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ […]