Dharani
Dharani
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి మరో షాక్ తగిలింది. చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ సర్వీస్ రూల్స్ అతిక్రమించినందుకు గాను శ్రీనివాస్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాగా ప్రస్తుతం శ్రీనివాస్ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నాడు. ఇక స్కిల్ డెవలప్‌మెంట్ కేసు, ఐటీ నోటీసుల్లో శ్రీనివాస్ పేరు కీలకంగా ఉండటం గమనార్హం. శ్రీనివాస్ ద్వారానే.. చంద్రబాబుకి నీధులు చేరాయని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలో శ్రీనివాస్ మీద సస్పెన్షన్ వేటు వేయడం.. చంద్రబాబుకు భారీ షాక్ అనే చెప్పవచ్చు.
చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్.. ప్రభుత్వ అనుమతి లేకుండానే అమెరికాకు పారిపోయాడు. ఈ క్రమంలో శుక్రవారంలోగా శ్రీనివాస్ తిరిగి ఇండియా రావాలని ప్రభుత్వం నోటీసులు జారీ చేసినా.. అతడు వెనక్కి రాలేదు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌పై సస్పెన్షన్ విధించింది ప్రభుత్వం. మరోవైపు నారా లోకేష్ సన్నిహితుడు రాజేష్ కూడా దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే.