ఇప్పుడంటే ఫంక్షన్లకు ఉత్సవాలకు డీజే సౌండ్ లకు అలవాటు పడిపోయాం కానీ ఒకప్పుడు రికార్డింగ్ డాన్స్ ట్రూపులు రాజ్యమేలేవి. అయిదు నుంచి పది దాకా సభ్యులుండే బృందాలు ఊరూరా తిరిగి దొరికిన చోట స్టేజిలు కట్టుకుని స్టార్ హీరోల సూపర్ హిట్ పాటలకు అవే కాస్ట్యూమ్ లు, మేకప్ వేసుకుని డాన్సులు చేస్తుంటే జనం ఎగబడి చూసేవారు. టికెట్ కొన్న డబ్బులు కాక విడిగా తమకు నచ్చిన పాటలకు వేదిక పైకే చిల్లర విసిరేవారు. ఆ సంస్కృతి […]