సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను దిగ్గజ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సతీమణి, కుటుంబ సభ్యులు కలిశారు. సిరివెన్నెల కుటుంబాన్ని ఆదుకున్నందుకు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డితో సిరివెన్నెలకున్న అనుబంధాన్ని ముఖ్యమంత్రితో కుటుంబ సభ్యులు పంచుకున్నారు. సిరివెన్నెల అనారోగ్య సమయంలో చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకోవడం, ఆ కుటుంబానికి విశాఖలో ఇంటి స్ధలం మంజూరు చేయడంపై సీఎం జగన్ను కృతజ్ఞతలు తెలిపారు. సిరివెన్నెల కుటుంబానికి […]
తెలుగు చిత్రసీమ గర్వించదగ్గ గేయ రచయితల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకరు. ఆయన పాటల్లోని సాహిత్యం మనల్ని సూటిగా ప్రశ్నిస్తుంటుంది. ఆయన మూడు వేలకు పైగా పాటలు రాసినప్పటికీ కొన్ని పాటలు మాత్రం మనల్ని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. సీతారామశాస్త్రిగారు భౌతికంగా లేకపోయినా ఆయన పాటలు నింగి నేల ఉన్నంత కాలం జీవించే ఉంటాయి. కొన్ని లక్షల మందికి స్ఫూర్తి పాఠాలు నేర్పిస్తూనే ఉంటాయి. అలాంటి సరస్వతి పుత్రుల చివరి జ్ఞాపకాలు ప్రత్యక్షంగా పంచుకునే మహా యజ్ఞం ఐడ్రీంకే […]