తెలుగుదేశం పార్టీ చంద్రబాబు హస్తగతం అయ్యాక.. తొలిసారిగా భారీ సంక్షోభం ఎదుర్కొంటోంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ.. 2019 ఎన్నికల్లో దాన్ని నిలుపుకోలేకపోవడంతోపాటు.. చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం తగ్గిపోవడంతో ఆ పార్టీ అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. పార్టీ నేతలు తమ భవిష్యత్ తాము చూసుకునేందుకు సిద్ధమైయ్యారు. గడచిన ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు టీడీపీని వీడి యువనాయకుడైన వైఎస్ జగన్ నేతృత్వంలోని […]
ప్రకాశం జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరారు. ఈ రోజు సాయంత్రం తన కుమారుడు శిద్ధా సుధీర్‌తో కలసి ఆయన అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి నుంచి తాడేపల్లి వచ్చిన శిద్ధా రాఘవరావు విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలసి సీఎం వైఎస్ జగన్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శిద్ధా రాఘవరావును పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ జగన్.. శిద్ధా, ఆయన తనయుడు సుధీర్‌కు […]
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు పార్టీని వీడుతుండడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడులో ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు వెళుతోంది. ఆయన తనను తాను నియంత్రించుకోలేకపోతున్నారు. పార్టీ మారుతున్న వారిపై ఆగ్రహం, అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు పార్టీని వీడగా.. తాజాగా మాజీ మంత్రి, ప్రకాశం జిల్లాకు చెందిన గ్రానైట్ వ్యాపారి శిద్ధా రాఘవరావు పార్టీని వీడడం ఖాయమైంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తీవ్ర అసహనం, అక్కడకు వెళ్లగక్కారు. పార్టీకి ద్రోహం చేసిన […]
తెలుగుదేశం పార్టీకి మరోపెద్ద ఎదురుదెబ్బ తగలడం ఖాయమైంది. ఆ పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్న గ్రానైట్ వ్యాపారి, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు టీడీపీని వీడబోతున్నారు. తనయుడు శిద్ధా సుధీర్‌తో కలసి రేపు శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరబోతున్నారని సమాచారం. ఈ మేరకు స్పష్టమైన నిర్ణయం తీసుకున్న శిద్ధా అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. శిద్ధా రాఘవరావు టీడీపీని వీడడం ఆ పార్టీకి, చంద్రబాబుకు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. ప్రకాశం జిల్లాలో ఆ పార్టీకి ఇప్పటి వరకూ […]
ప్రకాశం జిల్లాకి చెందిన మాజీమంత్రి శిద్దా రాఘవరావు సోదరుడి అన్న కుమారుడు శిద్దా హనుమంతరావు ఆదివారం ఉదయం బాలినేని సమక్షంలో మంత్రి బాలినేని స్వగృహంలో వైసిపిలో చేరారు. గతంలో చంద్రబాబు క్యాబినెట్ లో శిద్దారాఘవ రావు ప్రధాన శాఖలు నిర్వహించారు. గత ప్రభుత్వంలోశిద్దా రాఘవరావు జిల్లా రాజకియాలని చక్రం తిప్పారు. జిల్లాలో ఎవరికీ ఇవ్వనంతగా చంద్రబాబు కుడా రాజకీయంగా ఆయనకి అమిత ప్రాధాన్యత ఇచ్చారు. కాగా జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రానైట్ తవ్వకాలలో గత ప్రభుత్వంలో […]
స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రతిపక్ష టీడీపీకి వలసల భయం పట్టుకుంది. వరుసగా ముఖ్యనేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. కరణం బలరాం, సతీస్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, రెహమాన్, డొక్కా మాణిక్య వరప్రసాద్. కదిరి బాబూరావు తదితర నేతలు ఇప్పటికే ఆ పార్టీని వీడి వైసీపీ గూటికి చేరిపోయారు. ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ రేపో మాపో అధికార పార్టీలో […]
స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రతిపక్ష టీడీపీ నుంచి అధికార వైసీపీలోకి ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు క్యూ కడుతున్నారు. లాభనష్టాలు, సమీకరణాలపై ఆలోచించిన పిదప పార్టీ మారుతున్నట్లు లీకులిస్తున్నారు. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే పార్టీ మారుతూ టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు రామసుబ్బారెడ్డి, కదిరి బాబురావు, ఎమ్మెల్యే కరణం బలరాం తదితర నేతలు పార్టీ మారగా.. ఇప్పుడు ఆ జాబితాలోకి మారో నేత పేరు చేరుతుందన్న ప్రచారం గట్టిగా […]
తెలుగుదేశం హాయంలో ప్రభుత్వంలో చక్రం తిప్పిన తెలుగుదేశం నాయకులు, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ లకు చెందిన గ్రానైట్ క్వారీలలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా జుళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా క్వారీల్లో అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదుపై గత రెండు నెలలుగా ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి, బల్లికురవ పరిధిలోని గ్రానెట్ క్వారీలలో సోదాలు జరిపిన రాష్ట్ర గనులు భూగర్భశాఖ ఉన్నతాధికారులు చీమకుర్తి పరిధిలో 35 క్వారీల్లో, బల్లికురవ పరిధిలోని 33 […]
ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన రక్షణ రంగ ఉత్పత్తుల క్లస్టర్ (డిఫెన్స్ క్లస్టర్) ఏర్పాటుకి ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. బుదవారం ఉత్తరప్రదేశ్ రాజదాని లక్నోలో జరగుతున్న ఫ్రెంచ్-ఇండో డిఫెన్స్ ఎక్స్పో-2020 కార్యక్రమానికి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఫెన్స్ ఎక్స్‌పోకు హాజరైన 35 దేశాల ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ నేపధ్యంలో మంగళ […]