Idream media
Idream media
ప్రకాశం జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరారు. ఈ రోజు సాయంత్రం తన కుమారుడు శిద్ధా సుధీర్‌తో కలసి ఆయన అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి నుంచి తాడేపల్లి వచ్చిన శిద్ధా రాఘవరావు విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలసి సీఎం వైఎస్ జగన్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శిద్ధా రాఘవరావును పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ జగన్.. శిద్ధా, ఆయన తనయుడు సుధీర్‌కు పార్టీ కండువా కప్పారు. శిద్ధాతోపాటు ఆయన ప్రధాన అనుచరులు తాడేపల్లి వచ్చారు. కాగా ఇప్పటికే శిద్ధా రాఘవరావు సోదరులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
గ్రానైట్ వ్యాపారి ఆయిన శిద్ధా రాఘవరావు 1999లో టీడీపీలో చేరారు. శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్‌బోర్టు చైర్మన్‌గా, ఎమ్మెల్సీగా పని చేశారు. 2014లో తొలిసారి ప్రకాశం జిల్లా దర్శి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శిద్ధా.. చంద్రబాబు క్యాబినెట్‌లో రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఆయన వైసీపీలో చేరడంతో ప్రకాశం జిల్లాలో టీడీపీకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు.
Read Also : టీడీపీని వీడబోతున్న మాజీ మంత్రి శిద్ధా.. రాజకీయం జీవితం ఎలా మొదలైందంటే..?