కరోనా లాక్ డౌన్ల వల్ల ఓటిటి బూమ్ ఎంతగా పెరిగిపోయిందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. వెంకటేష్, నాని, సూర్య, నితిన్ లాంటి స్టార్ హీరోలు సైతం డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కు ఓకే చెప్పక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి, అందరూ థియేటర్లకు వస్తున్న తరుణంలో ఒమిక్రాన్ రూపంలో వైరస్ మళ్ళీ తిరగబడింది. ఇప్పుడు చాలా చోట్ల యాభై శాతం ఆక్యుపెన్సీలు నడుస్తున్నాయి. వీటిని రేపో మాపో సడలిస్తారు కానీ హాలు దాకా సినిమా చూసేందుకు […]