iDreamPost
సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ భాగస్వామ్యం ఉండటంతో అంచనాలు అంతో ఇంతో ఉన్నాయి. కొరియన్ హిట్ మిడ్ నైట్ రన్నర్స్ ఆధారంగా రూపొందిన ఈ థ్రిల్లింగ్ డ్రామాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు.
సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ భాగస్వామ్యం ఉండటంతో అంచనాలు అంతో ఇంతో ఉన్నాయి. కొరియన్ హిట్ మిడ్ నైట్ రన్నర్స్ ఆధారంగా రూపొందిన ఈ థ్రిల్లింగ్ డ్రామాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు.
iDreamPost
మాములుగా హీరో క్యాస్టింగ్ ఉంటేనే సినిమాలు తొందరగా మార్కెట్ అవుతాయి. అలాంటిది భారీ ఇమేజ్ లేని ఇద్దరు హీరోయిన్లతో మూవీ చేయడమంటే సాహసమే. నివేదా థామస్, రెజీనా ప్రధాన పాత్రల్లో శాకినీ డాకిని ఈ నెల 16న విడుదల కాబోతోంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ భాగస్వామ్యం ఉండటంతో అంచనాలు అంతో ఇంతో ఉన్నాయి. కొరియన్ హిట్ మిడ్ నైట్ రన్నర్స్ ఆధారంగా రూపొందిన ఈ థ్రిల్లింగ్ డ్రామాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. ఎప్పుడో 2019లో మొదలైనప్పటికీ కరోనా తదితర కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవుతూ ఇప్పటికి రిలీజ్ అవుతోంది. ముందు ఓటిటి కోసమని నిర్మాత సురేష్ బాబు అన్నా తర్వాత నిర్ణయం మార్చుకున్నారు.
ఇవాళ నిర్వహించిన ప్రెస్ మీట్ కి దర్శకుడు సుధీర్ వర్మ రాకపోవడం పలు చర్చలకు దారి తీసింది. తనకు ఇష్టం లేకుండా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేశారని, ఓయ్ ఫేమ్ ఆనంద్ రంగాతో కొంత భాగం రీ షూట్ చేయించారని ఇలా ఏవేవో వార్తల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దానికి తగ్గట్టే సుధీర్ వర్మ ఈ సినిమా గురించి ఎలాంటి ట్వీట్ కానీ ఇన్ఫో కానీ ఇవ్వడం లేదు. ఒకవేళ రవితేజ రావణాసురుడితో బిజీగా ఉన్నాడనుకున్నా మరీ ఓ గంట బయటకు రాలేనంత కాదుగా. రాజమౌళి అంతటి వాడే తను కేవలం సమర్పకుడిగా ఉన్నకారణంగా బ్రహ్మాస్త్ర కోసం ఆఖరికి టీవీ రియాలిటీ షోలకు కూడా వచ్చాడు. అలాంటపుడు సుధీర్ వర్మని మినహాయింపుగా చూడలేం.
యూనిట్ తరఫున ఇదే కారణాన్ని చెప్పారు కానీ అదేదో కనీసం ఒక వీడియో రూపంలో సుధీర్ క్లారిటీ ఇస్తే బాగుండేది. కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడినితో పాటు సుధీర్ బాబు కృతి శెట్టిల ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలితో పోటీ పడుతున్న శాకినీ డాకిని పూర్తిగా టాక్ మీదే ఆధారపడాల్సి ఉంటుంది. ఇద్దరు పోలీస్ ట్రైనీల మధ్య రాత్రి పూట జరిగే డ్రామాగా ఇది రూపొందింది. సెప్టెంబర్ 16 నేషనల్ సినిమా డే. ఈ సందర్భంగా అన్ని మల్టీప్లెక్సుల్లోనూ టికెట్లను కేవలం 75 రూపాయలకు అమ్ముతున్నారు. ఇది ఖచ్చితంగా శాకినీ డాకినికి ప్లస్ అయ్యేదే. టాక్ బాగా వచ్చిందా పికప్ ఉంటుంది లేదంటే అంతటితో సరి. చూద్దాం