సంగం డెయిరీ అక్రమాల వ్యవహారం నుంచి బయటపడేందుకు ఆ డెయిరీ చైర్మన్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కోర్టుల్లో వాదనను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఈ రోజు ఏసీబీ కోర్టులో నరేంద్ర బెయిల్ పిటిషన్, కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఇరు వైపుల వాదనలను విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్పై విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది. కస్టడీ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది. […]
అసలే కొడిగట్టిన దీపంలా ఉన్న తెలుగుదేశం పార్టీని సీనియర్ల చిన్నచూపు మరింత చిన్నబుచ్చుతోంది. ఇటీవలి కాలంలో పార్టీ సీనియర్ నేతలు ఏదో ఒక రూపంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలే దీనికి కారణమని.. తమ పార్టీ నేతల ఆర్థిక మూలలను దెబ్బతీయాలని జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఇది చంద్రబాబు, లోకేష్ ల నిర్వాకమేనని పార్టీ నేతల అంతర్గత చర్చలు వెల్లడిస్తున్నాయి. పార్టీనే నమ్ముకున్న […]
సంగం డెయిరీలో జరిగిన అక్రమాలు, అవినీతి వ్యవహారంపై అరెస్ట్ అయిన టీడీపీ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, డైయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్కు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. డెయిరీ అక్రమాలపై ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారంలో విచారణ జరపాలని ఏసీబీని ఆదేశించింది. మొత్తం వ్యవహారంపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా […]
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. సంగం డెయిరీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెయిరీ యాజమాన్యం, నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డెయిరీని ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చింది. డెయిరీ రోజువారీ కార్యకలాపాలను నిర్వహించే బాధ్యతను తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ కు అప్పగించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మయూర్ అశోక్.. వడ్లమూడిలోని సంగం […]
తప్పు జరిగితే వ్యవస్థలు స్పందిస్తాయి.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దానికి తన మాన బేధం ఉండదు. టిడిపి నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మాత్రం తన పై వచ్చిన ఆరోపణలు, సంగం డైరీ లో జరిగిన అవకతవకలు మీద సమాధానం చెప్పాల్సింది పోయి, తన మీద విచారణ వద్దని హైకోర్టు కు వెళ్ళడం ఇప్పుడు ఆయన నైతికత, నిబద్ధత నే ప్రశ్నించేలా కనిపిస్తోంది. ప్రభుత్వం ఒకరి మీద కేసు పెట్టినపుడు ఆ విచారణ ఎలా ఎదుర్కోవాలి? […]