అదేంటో ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను తప్పుబడుతున్న సాంకేతిక నిపుణులు పెరిగిపోతున్నారు. కొన్నేళ్ల క్రితం 1 నేనొక్కడినే ఫ్లాప్ అయినప్పుడు తన మేథాశక్తిని అర్థం చేసుకునేంత స్థాయికి ఆడియన్స్ రాలేదని దర్శకుడు సుకుమార్ ఒక స్టేట్ మెంట్ ఇచ్చినప్పుడు దాని మీద విమర్శలు వచ్చి పడ్డాయి. అయితే తన మాటలను అపార్థం చేసుకున్నారని ఆయన వివరణ ఇచ్చుకున్నారు కానీ అది వేరే విషయం. ఇప్పుడు అనంత శ్రీరామ్ వంతు వచ్చింది. సర్కారు వారి పాట ప్రమోషన్ లో భాగంగా […]