రేషన్ డోర్ డెలివరీ వాహనాల రంగుల వివాదానికి ఫుల్స్టాఫ్ పడింది. వివాదాన్ని రాజేసిన వారే దానికి ముగింపు పలికారు. ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన వాహనాల రంగులు మార్చాలంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ జారీ చేసిన ఆదేశాలను.. తాజాగా ఆయనే వెన క్కి తీసుకున్నారు. దీంతో కమిషనర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను డిస్ఫోజ్ చేస్తూ ఏపీ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. […]