iDreamPost
android-app
ios-app

ది వారియర్ బిజినెస్ ఎన్ని కోట్లు

  • Published Jul 12, 2022 | 11:42 AM Updated Updated Jul 12, 2022 | 11:42 AM
  • Published Jul 12, 2022 | 11:42 AMUpdated Jul 12, 2022 | 11:42 AM
ది వారియర్ బిజినెస్ ఎన్ని కోట్లు

ఎల్లుండి విడుదల కాబోతున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ కొత్త సినిమా ది వారియర్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. వర్షాలు ఒకపక్క టెన్షన్ పెడుతున్నప్పటికీ రెండు మూడు రోజుల్లో అంతా సర్దుకుంటుందన్న వాతావరణ శాఖ అంచనా నిజం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. రామ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న వారియర్ ముందు చాలా పెద్ద టార్గెటే ఉంది.

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీకి 43 కోట్ల దాకా బిజినెస్ జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ చేరాలంటే ఇంకో కోటి అయినా అదనంగా రావాలి. నైజామ్ 11 కోట్లు, సీడెడ్ 6 కోట్లు, ఆంధ్రా 17 కోట్లు కలిపి తెలుగు రాష్ట్రాలకు 34 కోట్లకు అమ్మారు. తమిళ వెర్షన్ 5 కోట్లు పలకగా, రెస్ట్ అఫ్ ఇండియాకు 2 కోట్లు, ఓవర్సీస్ కు 2 కోట్ల సొమ్ము చేసుకుంది. మొత్తంచూసుకుంటే 43 కోట్లవుతుంది.

ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా పెద్ద మొత్తం. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2, విక్రమ్, మేజర్ లు మాత్రమే జనాన్ని థియేటర్ దాకా రప్పించగలిగాయి. ఇప్పుడు ది వారియర్ కు ఆ స్థాయి టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ అందుకోవడం ఈజీనే. ఒకవేళ ఏ మాత్రం అటుఇటు అయినా చాలా కష్టం. ప్రస్తుతమున్న తుఫాను పరిస్థితుల వల్ల చివరి నిమిషంలో పైన చెప్పిన ఫిగర్లలో కీలక మార్పులు చోటు చేసుకోవచ్చు

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ