iDreamPost
android-app
ios-app

Ram : ఐకాన్ స్టార్ స్థానంలో ఇస్మార్ట్ హీరోతో సినిమా ?

  • Published Jan 29, 2022 | 10:59 AM Updated Updated Jan 29, 2022 | 10:59 AM
Ram : ఐకాన్ స్టార్ స్థానంలో ఇస్మార్ట్ హీరోతో సినిమా ?

ఇటీవలే అఖండతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న బోయపాటి శీను నెక్స్ట్ ఎవరితో చేస్తారనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఉండొచ్చనే ప్రచారం జరిగింది కానీ లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ లైన్ లోకి వచ్చాడట. లింగుస్వామి దర్శకత్వంలో చేస్తున్న ది వారియర్ అవ్వగానే బోయపాటితో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. అఖండ ప్రొడ్యూసర్ మిర్యాల రవీంద్రరెడ్డినే దీనికీ నిర్మాతగా వ్యవహరించబోతున్నారని వినికిడి. అధికారిక ప్రకటన ఇచ్చేందుకు కొంత టైం పడుతుందని ఆలోగా మిగిలిన పనులు పూర్తి చేసి ఇంకో నెల రెండు నెలల్లో అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇస్తారట.

ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత మాస్ లో పట్టు బిగించేందుకు రామ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగమే రెడ్. కాకపోతే అది ఆశించిన స్థాయిలో ఆడకపోవడం తనతో పాటు అభిమానులను నిరాశపరిచింది. అయితే పెర్ఫార్మన్స్ మాత్రం ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు సెట్స్ మీదున్న వారియర్ కూడా యాక్షన్ ఎంటర్ టైనరే. డాక్టర్ గా పోలీస్ ఆఫీసర్ గా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ని చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశారట. దీని సంగతలా ఉంచితే మాస్ హీరోయిజంని పీక్స్ లో చూపించే బోయపాటితో రామ్ కాంబినేషన్ అంటే అది ఏ స్థాయిలో ఉంటుందో ఉంటుందో ఊహకందదు. పూరికి పదింతలు ఎక్కువ స్కేల్ ఉన్న దర్శకుడీయన.

అనూహ్యంగా ఇప్పుడీ టాక్ వచ్చింది కానీ నిజానికి కొన్ని నెలల క్రితమే అంటే అఖండ రిలీజ్ కు ముందే రామ్ బోయపాటిలు పలు సార్లు చర్చించుకున్నారట. అల్లు అర్జున్ తో అనుకున్న మాట వాస్తవమే కానీ పుష్ప పార్ట్ 2 కంప్లీట్ చేయడానికి ఇంకో ఆరేడు నెలల సమయం పట్టడంతో పాటు ఆట్లీతో ఓ సినిమా చేసేందుకు బన్నీ ఉత్సాహం చూపిస్తున్నాడు. ఈ రెండు అయ్యేలోగా చాలా గ్యాప్ వస్తుంది. అప్పటిదాకా బోయపాటి వెయిట్ చేయడం కష్టం. సో రామ్ తో కలయికని ఈ రకంగా వాడుకోవచ్చు. మాస్ మసాలా తప్ప బోయపాటి నుంచి ఇంకేమి ఆశించలేం కానీ రామ్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేస్తాడో మీడియాకు ప్రకటన ఇచ్చాక చూడాలి

Also Read : Salaar : బాహుబలి రూటులోనే ప్రభాస్ మూవీ

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş