సినిమాల్లో ట్రిపుల్ రోల్ చాలా అరుదు. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ, అప్పుడెప్పుడో చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు, అంతకుముందు అన్న ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ లాంటివి తప్ప మరీ గుర్తుంచుకోదగ్గవి చాలా తక్కువ. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లోనూ అలాంటి చెప్పుకోదగ్గ చిత్రం ఒకటుంది. ఆ ముచ్చట్లు చూద్దాం. 1969 తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా ‘దైవ మగన్’ వచ్చింది. ఏసి త్రిలోకచందర్ దర్శకులు. కమర్షియల్ గానూ ఈ మూవీ గొప్ప విజయం అందుకుంది. […]
దసరా సంబరాలు థియేటర్లలోనే కాదు ఓటిటిలోనూ మొదలయ్యాయి. జ్యోతిక 50వ సినిమాగా మంచి ప్రచారం దక్కించుకున్న రక్త సంబంధం ఓటిటి రిలీజ్ అఫీషియల్ గా ఈ రోజే అయినప్పటికీ నిన్న రాత్రి నుంచే అందుబాటులోకి వచ్చింది. దీనికి సూర్య నిర్మాత. శశికుమార్, సముతిరఖని ప్రధాన పాత్రల్లో సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన ఈ సినిమా మీద భారీ అంచనాలేమీ లేవు కానీ డిజిటల్ విడుదల కాబట్టి ట్రైలర్ చూశాక అంతో ఇంతో ఆసక్తి కలిగింది. అందులోనూ ఇటీవలి […]