దేశ వ్యాప్తంగా మే 31 వరకు లాక్ డౌన్ పొడిగించిన కేంద్రం ముఖ్యమైన అంశాలపై నిర్ణయాల విషయాల్లో రాష్ట్రాలకే స్వేచ్ఛ ఇచ్చింది. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా మినహాయింపులు కల్పించింది. ఆర్టీసీ బస్సుల రాకపోకలు, స్థానిక రవాణాపై రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయాధికారం అని పేర్కొంది. రెడ్, కంటైన్మెంట్ జోన్లలో అనుసరించాల్సిన విధివిధానాలపైనా ఆయా ప్రభుత్వాలకు స్వేచ్ఛ కల్పించింది. కేంద్రం నిబంధనలతో రాష్ట్రాలు నష్టపోతున్నాయని సీఎంలు చేసిన ఫిర్యాదుతో కేంద్రం ఈ వెసులుబాటు కల్పించింది. అయితే.. స్కూళ్లు, కాలేజీలు, […]
మరో రెండు రోజుల్లో లాక్డౌన్ 3.0 ముగుస్తోంది. ఈ నెల 3వ తేదీన పొడిగించిన లాక్డౌన్ గడువు ఆదివారంతో ముగినుంది. అయితే లాక్డౌన్ కొనసాగుతుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లాక్డౌన్ 4.0 కు ప్రజలు సిద్ధంగా ఉండాలని ఇటీవల జాతీనుద్ధేశించి ఐదో సారి ప్రసంగించిన ప్రధాని మోదీ ఈ విషయం స్వయంగా చెప్పారు. అయితే లాక్డౌన్ 4.0కు సంబంధించిన అధికారిక ప్రకటన 18వ తేదీ లోపు వెల్లడిస్తామని చెప్పి ఉత్కంఠకు తెరతీశారు. లాక్డౌన్ 4.0 ఎలా […]
లాక్ డౌన్ విధించడం వల్ల కరోనా వైరస్ ను దేశంలో పూర్తిగా కట్టడి చేయలేమన్న భావనకు వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు లాక్ డౌన్ నుంచి అనేక అంశాలకు సడలింపు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు నుంచి అత్యంత కీలకమైన ప్రజా రవాణా వ్యవస్థను కూడా తిరిగి పట్టాలెక్కించింది. దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ నెల 17వ తేదీ తో లాక్ డౌన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరుసటి […]
దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. ఈనెల 17వ తేదీన మూడో విడత లాక్ డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ముఖ్య మంత్రులతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే లాక్ డౌన్ నుంచి అనేక అంశాలకు మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం 17వ తేదీతో ముగియనున్న మూడో విడత లాక్ డౌన్ తర్వాత మరిన్ని సడలింపులు ఇచ్చేందుకు అవకాశం ఉంది. ప్రజల రోజువారీ కార్యకలాపాలు, […]