iDreamPost
android-app
ios-app

రాష్ట్రాల‌కే స్వేచ్ఛ‌.. హెచ్చ‌రిక‌..!

  • Published May 17, 2020 | 1:31 PM Updated Updated May 17, 2020 | 1:31 PM
రాష్ట్రాల‌కే స్వేచ్ఛ‌.. హెచ్చ‌రిక‌..!

దేశ వ్యాప్తంగా మే 31 వరకు లాక్ డౌన్ పొడిగించిన కేంద్రం ముఖ్య‌మైన అంశాల‌పై నిర్ణ‌యాల విష‌యాల్లో రాష్ట్రాల‌కే స్వేచ్ఛ ఇచ్చింది. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా మినహాయింపులు క‌ల్పించింది. ఆర్టీసీ బస్సుల రాక‌పోక‌లు, స్థానిక రవాణాపై రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయాధికారం అని పేర్కొంది. రెడ్, కంటైన్మెంట్ జోన్ల‌లో అనుసరించాల్సిన విధివిధానాలపైనా ఆయా ప్రభుత్వాలకు స్వేచ్ఛ క‌ల్పించింది. కేంద్రం నిబంధనలతో రాష్ట్రాలు నష్టపోతున్నాయని సీఎంలు చేసిన ఫిర్యాదుతో కేంద్రం ఈ వెసులుబాటు క‌ల్పించింది.

అయితే.. స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, సినిమా హాళ్ల విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని పేర్కొంది. కీల‌క అంశాల‌పై స్వేచ్ఛ ఇస్తూనే ప‌రోక్షంగా హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేసింది. కరోనా కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే రాష్ట్రాలపై కఠినంగా వ్యవహరించేందుకు వెనుకాడబోమని సంకేతాలు పంపింది. మార్కెట్లు, కిరాణా దుకాణాలు, జ‌నం గుమిగూడే బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఎక్క‌డైనా స‌రే.. భౌతిక దూరం విష‌యంలో క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో ర‌వాణా విష‌యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఏ నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!