పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్యలో మొదలైన నిరసనలు ఆపై హింసాత్మకంగా మారి దేశంలోని పలు రాష్ట్రాలకు విస్తరించిన విషయం తెలిసిందే. ఈ నిరసనల్లో నిరసనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. రైళ్లు, బస్సులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వాధికారులు వాహనాలు.. ఇలా కనిపించిన ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ నిరసనకారుల్ని ఉద్దేశించి బుధవారం ఉత్తరప్రదేశ్లో మాట్లాడారు. నిరసనకారులు చేస్తున్నది తప్పో ఒప్పో ఒక సారి ప్రశాంతంగా ఆలోచన చేయాలని హితవు పలికారు. ప్రభుత్వ […]