కొద్దిరోజుల క్రితం తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ కోసం భారీ రాయితీలు ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. ఈ ఆఫర్ని ఉపయోగించుకొని ప్రజలు కూడా పెండింగ్లో ఉన్న చలాన్లని కట్టేశారు. దీంతో ప్రభుత్వానికి ఒక్కసారిగా భారీ ఆదాయం చేకూరింది. ఇటీవలే ఈ ఆఫర్ పూర్తవడంతో ట్రాఫిక్ పోలీసుల బాటలో తాజాగా కొత్త ఆఫర్ని ప్రకటించారు హైదరాబాద్ నగర పోలీసులు. కరోనా లాక్డౌన్ సమయంలో వైరస్ వ్యాప్తి చెందకుండా పోలీసులు కొన్ని నిబంధనలు విధించారు. కాని చాలామంది […]