iDreamPost
iDreamPost
కొద్దిరోజుల క్రితం తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ కోసం భారీ రాయితీలు ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. ఈ ఆఫర్‌ని ఉపయోగించుకొని ప్రజలు కూడా పెండింగ్‌లో ఉన్న చలాన్లని కట్టేశారు. దీంతో ప్రభుత్వానికి ఒక్కసారిగా భారీ ఆదాయం చేకూరింది. ఇటీవలే ఈ ఆఫర్ పూర్తవడంతో ట్రాఫిక్ పోలీసుల బాటలో తాజాగా కొత్త ఆఫర్‌ని ప్రకటించారు హైదరాబాద్ నగర పోలీసులు.
కరోనా లాక్డౌన్ సమయంలో వైరస్ వ్యాప్తి చెందకుండా పోలీసులు కొన్ని నిబంధనలు విధించారు. కాని చాలామంది లెక్క చేయకుండా ఆ రూల్స్‌ని బ్రేక్ చేశారు. ఆ సమయంలో దాదాపు లక్షల్లో కేసులు నమోదయ్యాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద అధికారులు వేర్వేరు సెక్షన్లపై కేసులు నమోదు చేయగా వాటిలో ఇంకా మూడు లక్షల కేసులు పెండింగ్‌లో ఉండటంతో ఈ ఆఫర్‌ని ప్రకటించారు పోలీసులు. ఈ ఆఫర్ ప్రకారం ఆ సమయంలో నమోదు చేసిన ఏ సెక్షన్ కేసులకైనా సెక్షన్‌కి 10రూపాయల చొప్పున చెల్లిస్తే చాలు కేసులు కొట్టేస్తామనే బంపర్ ఆఫర్‌ని ప్రకటించారు.
అయితే ఈ ఆఫర్ కేవలం ఈనెల 2వ తేది నుంచి 8వ తేది వరకు మాత్రమే అని తెలిపారు. ఆ ఆఫర్ ని ఉపయోగించుకొని పది రూపాయలు చెల్లించి కేసులు క్లియర్ చేసుకోవాలని సిటీ అడిషనల్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాసులు ప్రజలకి తెలిపారు. కరోనా లాక్డౌన్ సమయంలో నమోదైన కేసుల్లో పెండింగ్‌లో ఉన్న మూడు లక్షల మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, లేకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.