మొన్న శుక్రవారం వచ్చిన సినిమాలు మొదటి వీకెండ్ ని పూర్తి చేసుకున్నాయి. దేనికీ యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రాకపోవడం ట్రేడ్ ని నిరాశ పరిచినప్పటికీ ఉన్నంతలో వసూళ్లు పర్వాలేదు అనిపించేలా రావడంతో హమ్మయ్య అనుకున్నాయి. కానీ పూర్తి హ్యాపీగా అయితే లేరు. దీపావళి పండగను టార్గెట్ చేసుకుని ఒక రోజు ముందే వచ్చిన చిత్రాలకు మిశ్రమ స్పందన దక్కడం ఒకింత నిరాశను కలిగించేదే. ముందు పెద్దన్న సంగతి చూస్తే తెలుగు వెర్షన్ నాలుగు రోజులకు గాను […]
నిన్న మొత్తం మూడు తెలుగు సినిమాలు తెలుగు ప్రేక్షకులకు పండగ కానుకలుగా వచ్చాయి. అందులో మొదటిది పెద్దన్న. రజినీకాంత్ హీరోగా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన ఈ ఎంటర్ టైనర్ ప్రేక్షకులను నిరాశపరుస్తోంది. ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో రావడం లేదని ట్రేడ్ రిపోర్ట్. సుమారు 1 కోటి 60 లక్షల షేర్ తెలుగు రాష్ట్రాల నుంచి నమోదైనట్టుగా తెలిసింది. ఇది చాలా తక్కువ మొత్తం. నైజాంలో చూసుకుంటే దర్బార్ కి ఫస్ట్ డే 2 […]
పండగ పూట ఈ మధ్య నాకు రాహుకాలం వెంటాడుతోంది. దసరాకి టైం బాగలేక ఎల్జిబుల్ బ్యాచిలర్ చూశాను. అఖిల్ ఉతికినా, ఏదో ఏరియల్ పౌడర్‌తో సుకుమారంగా వాషింగ్ మిషన్‌లో కాసేపు తిప్పాడు. దీపావళి నాడు లోపల ఏదో అనుమానం పీకుతా వుంది. రజనీకాంత్ రాడ్ పట్టుకుని నిలబడ్డాడు. అయినా మన రజనీ కదా అని ధైర్యం చేశాను. పాతకాలం హీరో కదా, కొంచెం మోటు పద్ధతి. మట్టిబానలో చవుడు వేసి ఉడికించి బయటికి తీసి బండకి దబదబ […]
2020 సంక్రాంతి దర్బార్ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ ఈసారి పెద్దన్నగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాస్ ఎంటర్ టైనర్స్ ఇచ్చి అజిత్ తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందించిన శివ దర్శకుడిగా సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో నయనతార, ఖుష్బూ, మీనాల క్యాస్టింగ్ తో పాటు కీర్తి సురేష్ చెల్లెలిగా నటించడం ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచింది. ట్రైలర్ వచ్చాక పాత రజిని మాస్ […]
రేపు మరో శుక్రవారం బాక్సాఫీస్ యుద్ధానికి రంగం సిద్ధమయ్యింది. కనీసం రెండు మూడు చెప్పుకోదగ్గ క్రేజీ సినిమాలు రాకుండా ఏ వారం గడవటం లేదు. ఈసారి దీపావళి పటాసులతో పాటు స్టార్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధ పడుతున్నారు. అందులో మొదటిది సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్దన్న. తెలుగు వెర్షన్ కు సుమారు 12 కోట్ల 50 లక్షల దాకా బిజినెస్ చేసినట్టు ట్రేడ్ టాక్. దీనికి అదనంగా మరో యాభై లక్షలు తెస్తే బ్రేక్ ఈవెన్ […]
సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్దన్న విడుదలకు రంగం సిద్ధం అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్ కు సన్ పిక్చర్స్ సంస్థ అన్ని సన్నాహాలు పూర్తి చేస్తోంది. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. కొన్ని చోట్ల టికెట్లు హాట్ కేక్స్ లా అమ్ముడుపోతున్నాయి. నవంబర్ 1 నుంచి థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీకి తమిళనాడు ప్రభుత్వం అనుమతులు జారీ చేయడంతో డిస్ట్రిబ్యూటర్ల ఆనందం మాములుగా లేదు. శివ కార్తికేయన్ సినిమానే వరల్డ్ వైడ్ వంద కోట్లకు దూసుకుపోగా […]
ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ప్రేక్షకులు పెద్దా చిన్న తేడాలు అంతగా చూసుకోవడం లేదు. విషయం ఉందా చాలు హిట్టు కొట్టించి మరీ నిర్మాతలకు లాభాలు అందిస్తున్నారు. అందుకే ప్రతి శుక్రవారం పోటీపడుతూ ప్రకటనలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అందరి కన్ను దీపావళి మీదకు వెళ్తోంది. ఎన్నడూ లేనిది ఈసారి దసరా పండక్కు బాక్సాఫీస్ బాగా కళకళలాడింది. అందుకే టపాసుల సంబరాల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందనే నమ్మకంతో ఇండస్ట్రీ జనాలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి వారం పోటీ […]