iDreamPost
android-app
ios-app

Box Office Weekend Collections :బాక్సాఫీస్ వారాంతపు వసూళ్లు ఎలా ఉన్నాయి

  • Published Nov 08, 2021 | 11:27 AM Updated Updated Nov 08, 2021 | 11:27 AM
Box Office Weekend Collections :బాక్సాఫీస్ వారాంతపు వసూళ్లు ఎలా ఉన్నాయి

మొన్న శుక్రవారం వచ్చిన సినిమాలు మొదటి వీకెండ్ ని పూర్తి చేసుకున్నాయి. దేనికీ యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రాకపోవడం ట్రేడ్ ని నిరాశ పరిచినప్పటికీ ఉన్నంతలో వసూళ్లు పర్వాలేదు అనిపించేలా రావడంతో హమ్మయ్య అనుకున్నాయి. కానీ పూర్తి హ్యాపీగా అయితే లేరు. దీపావళి పండగను టార్గెట్ చేసుకుని ఒక రోజు ముందే వచ్చిన చిత్రాలకు మిశ్రమ స్పందన దక్కడం ఒకింత నిరాశను కలిగించేదే. ముందు పెద్దన్న సంగతి చూస్తే తెలుగు వెర్షన్ నాలుగు రోజులకు గాను 3 కోట్ల 15 లక్షల దాకా షేర్ వచ్చినట్టు తెలిసింది. ఈ రోజు నుంచి డల్ అయ్యింది. థియేట్రికల్ గా ఇంకా 9 కోట్లకు పైగా రావాల్సి ఉండటంతో డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తప్పేలా లేవు.

ఇక మారుతీ మంచి రోజులు వచ్చాయి సంగతి చూస్తే ఇది కూడా మెరుగ్గా ఏమి లేదు. దర్శకుడి బ్రాండ్ ని వాడుకుని విపరీతమైన మార్కెటింగ్ చేసిన టీమ్ దానికి తగ్గ ఫలితాన్ని అందుకోలేకపోయింది. హీరో సంతోష్ శోభన్ స్థాయికి మించి బిజినెస్ చేసిన ఈ సినిమాకు వచ్చిన వీకెండ్ టోటల్ షేర్ 2 కోట్ల 25 లక్షలు మాత్రమేనట. ఇంకా 8 దాకా రావాలి. ఇది అసాధ్యమే. విశాల్ ఎనిమి తక్కువ రేట్లకు అమ్మడం బయ్యర్లకు హార్ట్ అటాక్ లు తప్పిస్తోంది. 2 కోట్ల 12 లక్షల దాకా షేర్ వచ్చింది. అయితే జరిగిన బిజినెస్ 5 కోట్ల లోపే కావడంతో బ్రేక్ ఈవెన్ కు ఛాన్స్ ఉందనే అంచనాలు గట్టిగా ఉన్నాయి. ఇంకొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది.

ఇక బాలీవుడ్ మల్టీ స్టారర్ సూర్యవంశీ దేశవ్యాప్తంగా ఏమో కానీ తెలుగు రాష్ట్రలో మాత్రం కేవలం నగరాల్లో మాత్రం తన ఉనికిని చాటుకుంటోంది. ఇది చూసే తీరాలన్న యాంగ్జైటిలో మన జనాలు లేరు. అందుకే హైదరాబాద్ వైజాగ్ లాంటి నగరాలు మినహా మిగిలిన చోట్ల పర్వాలేదు అనిపించుకుంటోంది. ఇక ఇంగ్లీష్ మూవీ ఇటర్నల్స్ సోసోగానే ఆడుతోంది. మార్వెల్ సంస్థ నుంచి వచ్చిన వీక్ మూవీగా ఇప్పటికే సోషల్ మీడియాలో దీని మీద కామెంట్లు వచ్చి పడుతున్నాయి. ఈ వారంలో మరికొన్ని సినిమాలు రాబోతున్న నేపథ్యంలో ఈ నాలుగు రోజులు వీటికి చాలా కీలకం. మొత్తానికి వసూళ్లు మాత్రం కిక్ ఇవ్వలేదు

Also Read : Venkatesh & Rana : దృశ్యం 2 , విరాటపర్వం కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు