iDreamPost
android-app
ios-app

Rajinikanth : తగ్గిపోయిన మార్కెట్ ని తలైవా నిలబెట్టుకోవాలి

  • Published Oct 24, 2021 | 4:42 AM Updated Updated Oct 24, 2021 | 4:42 AM
Rajinikanth : తగ్గిపోయిన మార్కెట్ ని తలైవా నిలబెట్టుకోవాలి

సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్దన్న విడుదలకు రంగం సిద్ధం అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్ కు సన్ పిక్చర్స్ సంస్థ అన్ని సన్నాహాలు పూర్తి చేస్తోంది. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. కొన్ని చోట్ల టికెట్లు హాట్ కేక్స్ లా అమ్ముడుపోతున్నాయి. నవంబర్ 1 నుంచి థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీకి తమిళనాడు ప్రభుత్వం అనుమతులు జారీ చేయడంతో డిస్ట్రిబ్యూటర్ల ఆనందం మాములుగా లేదు. శివ కార్తికేయన్ సినిమానే వరల్డ్ వైడ్ వంద కోట్లకు దూసుకుపోగా లేనిది పక్కా మాస్ ఎంటర్ టైనర్ తో వస్తన్న తలైవాకు ఇది మంచి నీళ్లు తాగినంత ఈజీ అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా తెలుగులో దీని మీద ఆ స్థాయిలో బజ్ లేదు కానీ రిలీజ్ టైమింగ్ ప్రకారం చూసుకుంటే ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. పోటీగా మారుతీ సంతోష్ శోభన్ కాంబినేషన్ లో తీసిన మంచి రోజులు వచ్చాయి ఒక్కటే ఉంది. రజినిది పక్కా మసాలా మూవీ కాబట్టి బిసి సెంటర్స్ లో డామినేట్ చేయొచ్చు. 12 కోట్ల దాకా ఇక్కడ థియేట్రికల్ బిజినెస్ చేశారు. టాక్ బాగా వచ్చిందంటే దాన్ని రికవర్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. సిరుతై శివ దర్శకత్వంలో వహించిన పెద్దన్నకు ఇమాన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఖుష్బూ, మీనా, కీర్తిసురేష్, ప్రకాష్ రాజ్ లాంటి క్యాస్టింగ్ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతోంది.

రోబో తర్వాత రజినీకాంత్ సినిమా ఏదీ తెలుగులో లాభాలను ఇవ్వలేకపోయింది. లింగా, కబాలి, కాలా, 2.0, పేట, దర్బార్ లలో ఒక్కటంటే ఒక్కటి బ్రేక్ ఈవెన్ దాటలేదు. యానిమేషన్ మూవీ విక్రమసింహ కూడా నిరాశపరిచింది. అందుకే 20 కోట్లకు పైగా ఉన్న తలైవా తెలుగు మార్కెట్ రేంజ్ ఇప్పుడు 12 కోట్ల దగ్గరకు వచ్చింది. పెద్దన్న కనక మెప్పిస్తే మళ్ళీ గ్రాఫ్ పైకి ఎగబాకే ఛాన్స్ ఉంది. నిన్న విడుదలైన టీజర్లో వింటేజ్ రజిని గుర్తొస్తున్నాడు కానీ మరీ రొటీన్ మసాలా ఎక్కువైనా కష్టమే. మాస్ పల్స్ ని సరిగ్గా పసిగట్టి అజిత్ బ్యాక్ టు బ్యాక్ మూడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు శివ మీద ఫ్యాన్స్ కొండంత నమ్మకం పెట్టుకున్నారు. చూద్దాం

Also Read : Gopala Gopala : శివుడి నెగటివ్ సెంటిమెంట్ ని దాటేయాలి