బరిలో అడ్డంగా నుంచున్నోళ్ళని చుట్టూ తిరగమని చెప్తూ.. చేతిలో చెర్నకోలతో ఓ రౌండు దెబ్బేసేసేరు ఆర్గనైజరు చిన్న రాజు గారు. అలా వేస్తన్నప్పుడే ఫెన్సింగికవతల ఎంత మంది కోళ్ళట్టుకుని నుంచున్నారో ఓ లుక్కు కూడా ఏసేసారు. సంక్రాంతి రోజు అయిదయిపోతుంది. యిక్కడ జూస్తే పందెగాళ్ళింకా కోళ్ళతో రడీగా నుంచుని పందేలకోసం ఎదురు చూస్తన్నారు. అప్పుడే తెఁవిలే యవ్వారం కాదిది అనుకుని, బరి బయటకెళ్ళేరు ఓ రౌండు బ్రాండీ బిగించేద్దామని. ఫోనులో.. బరి చుట్టూ సీరియల్ లైట్లు బిగించమని […]