ఒక్క కేజీ ఉల్లిపాయలు కొనాలంటేనే జేబు తడుముకుంటుంటే ఇన్నివేల టన్నుల్లో చెబుతున్నారేంటీ అనుకోంకండే.. ఇవి త్వరలో మన దేశానికి రప్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్గోయల్ వెల్లడించారు. వాతావరణ పరిస్థితులు, పంట చేతికి రాకపోవడం, వచ్చిన పంట దెబ్బతినడం, డిమాండ్లో పెరుగుదల వెరసి ఉల్లి, బంగాళాదుంపల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో రానున్న పండుగల సీజన్కు ముందే ఉల్లి, బంగాళా దుంప ధరలను నేలమీదికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఏడువేల టన్నుల ఉల్లిపాయలు […]