నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో క్యాంపస్ మొత్తం పొగతో నిండిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా నిర్దారించారు. అకడమిక్ బ్లాక్ ఏబీ 1 క్లాస్‌రూమ్‌లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో క్లాస్‌రూమ్‌లోని ఫర్నీచర్, ప్రొజెక్టర్, సుమారు 60 నుంచి 70 వరకు చైర్లు, 21 టేబుల్స్ పూర్తిగా దగ్థం అయ్యాయి. అగ్నిప్రమాదం వల్ల క్యాంపస్ మొత్తం పొగతో నిండిపోయింది. ప్రమాద విషయం గమనించిన అధికారులు అగ్నిమాపకసిబ్బందికి సమాచారమందించారు. […]