Krishna Kowshik
‘బిడ్డొచ్చిన వేళ, గొడ్డు వచ్చిన వేళ’ అంటూ పెద్దలు సామెతను వినియోగిస్తుంటారు. ఆ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగి(కొత్త కోడలు ఇంటికి రావడం లేదా, బిడ్డలు పుట్టడం) .. కొన్ని గంటల్లోనే, రోజుల్లోనే, నెలల్లోనే విషాదం నింపుకున్న సమయంలో ఈ సామెతను వాడుతూ ఉంటారు. అయితే..విధి ఆడిన..
‘బిడ్డొచ్చిన వేళ, గొడ్డు వచ్చిన వేళ’ అంటూ పెద్దలు సామెతను వినియోగిస్తుంటారు. ఆ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగి(కొత్త కోడలు ఇంటికి రావడం లేదా, బిడ్డలు పుట్టడం) .. కొన్ని గంటల్లోనే, రోజుల్లోనే, నెలల్లోనే విషాదం నింపుకున్న సమయంలో ఈ సామెతను వాడుతూ ఉంటారు. అయితే..విధి ఆడిన..
Krishna Kowshik
విధి రాత ముందు ఎన్ని అనుకున్నా.. ఆ సమయానికి ఏదీ జరగాలని రాసి పెట్టి ఉంటుందో అదే జరుగుతుంది. సాధారణంగా పెంచి పెద్ద చేసిన పిల్లల చేతుల్లో తల్లిదండ్రులు కన్నుమూయాలని అనుకుంటారు కానీ.. కడుపున పుట్టిన బిడ్డలే తమ కళ్ల ముందు చనిపోతుంటే.. ఆ బాధ వర్ణనాతీతం. ఈ తల్లిదండ్రుల విషయంలో అదే చోటుచేసుకుంది. బంగారం లాంటి పిల్లలు.. వారి చేతుల్లో కన్నుమూసి, వారితో తల కొరువు పెట్టించుకోవాలనుకున్న తండ్రి..ఎదుటే పిట్టల్లా రాలిపోతున్నారు కొడుకులు. మలి దశలో తమను చూడాల్సిన కొడుకులు విగత జీవులుగా మారిపోవడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆ పుత్ర శోకాన్ని ఎవ్వరూ తీర్చలేరు.
వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శ్రీరాం నగర్‌లోని జోగు నర్సయ్యకు నలుగురు కొడుకులు. పెద్ద కొడుకు నరేందర్ 20 ఏళ్ల క్రితం కరెంట్ స్థంబం ఎక్కడంతో షాక్ కొట్టి మరణించాడు. ఈ బాధ నుండి బయట పడకముందు.. రెండవ కుమారుడు రాజేందర్ 7 ఏళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ఆ తల్లిదండ్రులకు ఇద్దరు కుమారులే మిగిలారు. వీరి మూడవ కుమారుడు రవి..కుటుంబాన్ని పోషించేందుకు గల్ఫ్ వెళ్లాడు. అక్కడే పనిచేస్తూ.. కొంత డబ్బును కూడబెట్టుకుని సొంత ఊరిలో ఇళ్లు కట్టుకున్నాడు. సొంతింటి కల తీరడంతో.. ఉద్యోగానికి సెలవు తీసుకుని ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఇంటి నిర్మాణం పూర్తైన వెంటనే గృహ ప్రవేశాన్ని ఏర్పాటు చేశాడు.
ఫ్రెండ్స్, చుట్టాలు, బంధువులను గృహ ప్రవేశానికి ఆహ్వానించాడు. ఈ నెల 17న ఓ పండుగలా చేశాడు ఆ కార్యక్రమాన్ని. సోమవారం వ్రతాలు, పూజలు నిర్వహించాడు. పనులన్నీ పూర్తయ్యాయని, ఇక సొంతింట్లో భార్యా, బిడ్డలు, తల్లిదండ్రులతో ఉండబోతున్నానని ఆనంద పడ్డ రవి ఆశలను గల్లంతు చేసింది విధి. మంగళవారం రాత్రి భోజనం చేసి సోఫాపై వాలిన రవి.. గుండెపోటుతో శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. సోఫాలో నుండి లేపుతున్నా.. ఉలుకు పలుకు లేకపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లే సరికి హార్ట్ ఎటాక్‌తో మరణించాడని వైద్యులు నిర్దారించారు. ఏ ఇంటి గృహ ప్రవేశానికని తెప్పించాడో ఆ షామియానా, కుర్చీలు.. అతడి చివరి యాత్రకు వినియోగించాల్సి వచ్చింది.
గృహ ప్రవేశంలో తమతో సందడి సందడిగా గడిపిన రవి ఇక లేడన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు బంధువులు. ఇక తల్లిదండ్రుల పరిస్థితి ఘోరం. పిల్లలపై ఆధారపుడుతుండగా.. ఒక్కొక్కరుగా తమ కళ్ల ముందే చనిపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. రవి భార్య, పిల్లలు అయితే..అయోమయంలో ఉండిపోయారు. గృహ ప్రవేశానికి వచ్చిన వారంతా.. రవి మరణ వార్త విని శోక సంద్రంలో మునిగిపోయారు. సెలవులపై వచ్చిన రవి.. ఇప్పుడు శాశ్వతంగా ఈ లోకం నుండి తరలివెళ్లిపోయాడని తెలిసి.. స్నేహితులు, కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్సయ్య కుటుంబంపై విధి ఎందుకు ఇంత పగబట్టిందని మాట్లాడుకుంటున్నారు. నిజంగా విధి ఉందని నమ్ముతున్నారా.. ఇలాంటి సంఘటనలు మీకు ఎదురైతే.. వాటిని కామెంట్ల రూపంలో తెలియజేయండి.