iDreamPost
android-app
ios-app

ప్రేమోన్మాది ఘాతుకం.. నడి రోడ్డుపై ప్రియురాలిని

  • Published Feb 08, 2024 | 4:25 PM Updated Updated Feb 08, 2024 | 4:25 PM

నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది ఘాతుకానికి మరో యువతి బలైంది. తనతో పెళ్లి నిరాకరించిందన్న అక్కసు పెంచుకున్న ప్రియుడు దారుణానికి పాల్పడ్డాడు.

నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది ఘాతుకానికి మరో యువతి బలైంది. తనతో పెళ్లి నిరాకరించిందన్న అక్కసు పెంచుకున్న ప్రియుడు దారుణానికి పాల్పడ్డాడు.

  • Published Feb 08, 2024 | 4:25 PMUpdated Feb 08, 2024 | 4:25 PM
ప్రేమోన్మాది ఘాతుకం.. నడి రోడ్డుపై ప్రియురాలిని

తెలంగాణ నిర్మల్ జిల్లాలో ఘోరం జరిగింది. ఖానాపూర్‌లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రియురాలిని నడి రోడ్డుపై గొడ్డలితో నరికి చంపాడు శ్రీకాంత్ అనే యువకుడు. పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఉన్మాది ఈ దారుణానికి పాల్పడ్డాడు. సంఘటనా స్థలంలోనే యువతి అలేఖ్య కన్నుమూసింది. ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బాధితురాలి కుటుంబ సభ్యులపైనా దాడి చేశాడు. అంబేదర్కర్ నగర్‌కు చెందిన అలేఖ్య, శ్రీకాంత్ గత కొన్ని రోజులగా ప్రేమించుకుంటున్నారు. అయితే.. తనను కాదని, మరొకరిని వివాహం చేసుకోవడంతో..కోపంతో రగిలిపోయిన ప్రియుడు శ్రీకాంత్.. అలేఖ్యను నడిరోడ్డుపై గొడ్డలితో నరికి చంపాడు.

అలేఖ్యకు కొన్ని రోజుల క్రితం వివాహం నిశ్చయమైంది. త్వరలోనే పెళ్లి. ఈ నిమిత్తం వివాహానికి అవసరమైన సామానులు కొనుగోలు చేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఖానాపూర్ మార్కెట్ వచ్చింది అలేఖ్య. వాటిని కొనుగోలు చేసి ఇంటికి వెళుతుండగా.. శివాజీ నగర్ శివారులో కాపు కాశాడు శ్రీకాంత్.  అక్కడే శ్రీకాంత్ గొడ్డలితో నడి రోడ్డుపై అలేఖ్యపై దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి మరణించింది. శ్రీకాంత్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అలేఖ్య వదిన జయా, ఆమె కుమారుడిపై కూడా దాడి చేశాడు ఈ ఉన్మాది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabet