ఎట్టకేలకు ఒక అంకం ముగిసింది.. నిర్భయకు నిజమైన న్యాయం దక్కింది.. న్యాయం గెలవడానికి సమయం పట్టొచ్చు కానీ, ఎప్పటికైనా గెలుస్తుందన్న విశ్వాసాన్ని నిర్భయ దోషులు ఉరితో మరోసారి రుజువైంది.. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో దేశ రాజధాని నడిబొడ్డున కదులుతున్న బస్సులో నిర్భయపై సాగిన అరాచక పర్వం చూసి యావత్ దేశం ఉలిక్కిపడింది..స్త్రీలను దేవతగా పూజించే దేశంలో ఇదేనా స్త్రీలకు ఉన్న రక్షణ అని ప్రపంచవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి.. మగాళ్లు కాస్త మృగాళ్లలా మారి చేసిన […]
నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు రోజుకో మలుపు తిరుగుతుంది. ఏదొక పిటిషన్ వేస్తూ శిక్ష అమలుకు జాప్యం కలిగేలా చేస్తున్న నిర్భయ దోషులకు వ్యతిరేకంగా కేంద్రం వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు, నిందితులందర్నీ ఒకేసారి ఉరి తీయాలని స్పష్టం చేసింది. మెర్సీ పిటిషన్ పెండింగ్ లో ఉంటే మిగిలిన నిందితులకు ఉరిశిక్ష విధించొచ్చని జైలు నిబంధనల్లో లేదని తేల్చి చెప్పింది. జైలు అధికారుల […]
16 డిసెంబర్ 2012 భారత దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జరిగిన అత్యాచార ఘటన దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కదులుతున్న బస్సులో ఆరుగురు ఉన్మాదులు మద్యం మత్తులో సాగించిన ఆ ఘోర ఘటనను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఆ సంఘటన జరిగిన 13 రోజుల తరువాత మృత్యువుతో పోరాడుతూ నిర్భయ చనిపోయింది. దీంతో హడావిడిగా నిర్భయ చట్టం తీసుకొచ్చారు. అత్యాచార చేసే నిందితులకు కఠిన(ఉరి)శిక్షలు విధించేలా చట్ట సవరణలు చేసారు. ఒకవేళ మైనర్లు […]
నిర్భయ నిందితుల ఉరి శిక్ష అమలు ఈ నెల 22 న జరిగే అవకాశం లేదని ఢిల్లీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఇప్పటికే డైలీ సీరియల్ తరహాలో అనేక మలుపులు తిరుగుతున్న నిర్భయ నిందితుల ఉరి శిక్ష అమలులో జాప్యం జరుగుతూ వస్తుంది. నిందితులు చట్టాల్లోని లొసుగులను ఉపయోగించుకుని ఉరిశిక్షను వాయిదా పడేలా చేస్తున్నారని న్యాయ నిపుణులు అంటున్నారు. తాజాగా నిర్భయ దోషి ముఖేష్ సింగ్ పెట్టుకున్న రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ నేడు రాష్ట్రపతి వద్దకు చేరుకుంది. ఈ పిటిషన్ […]