గ్రామ పరిపాలనలో భాగస్వాములయ్యే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్లోని యువత కోల్పోయింది. 2019 ఓటర్ల జాబితా ప్రకారం జరుపుతున్న ఎన్నికల వల్ల 3.60 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కోల్పోతున్నారని, 2021 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్ల వాదనతో విభేధించిన హైకోర్టు.. ఈ దశలో పంచాయతీ ఎన్నికల్లో జోక్యం చేసుకోబోమని చెబుతూ.. దాఖలైన రెండు పిటిషన్లను తోసిపుచ్చింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర […]