iDreamPost
android-app
ios-app

మీకు ఓటర్ కార్డు లేదా? ఇదే మంచి అవకాశం..ఈ ఛాన్స్ మిస్ కావొద్దు!

Voters Alert: ఇటీవలే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందడి ముగిసింది. తర్వాత వరుసలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. కొద్ది నెల్లలో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఈ నేపథ్యంలో ఓటర్ జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమైంది.

Voters Alert: ఇటీవలే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందడి ముగిసింది. తర్వాత వరుసలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. కొద్ది నెల్లలో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఈ నేపథ్యంలో ఓటర్ జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమైంది.

మీకు ఓటర్ కార్డు లేదా? ఇదే మంచి అవకాశం..ఈ ఛాన్స్ మిస్ కావొద్దు!

ఓటు హక్కు కలిగి ఉండడం ప్రతీ పౌరుడి బాధ్యత.  ప్రజాస్వామ్య దేశంలో ఓటు చాలా విలువైనది. మనం వేసే ఓటు దేశాభివృద్ధిని నిర్ణయిస్తుంది. అందుకే ఓటు కలిగి ఉండటం, దానిని  వినియోగించుకోవడంపై ప్రతి ఒక్కరు బాధ్యతతో ఉండాలి. ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన ప్రతి వారు ఓటు నమోదు చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా?. త్వరలో లోక్‌సభ, మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కొత్త ఓటర్ల ప్రక్రియ నమోదుకు శ్రీకారం చుట్టారు.

ఎన్నికల సంఘం ప్రజలు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవడానికి మరో అవకాశం కల్పించింది. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదు కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రభుత్వం.. తాజాగా మరోసారి ఓటరు నమోదు, ఓటర్ కార్డులో మార్పులు చేర్పులకు ఛాన్స్ ఇచ్చింది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కొత్త ఓటర్ల ప్రక్రియ నమోదుకు శ్రీకారం చుట్టారు. 18 ఏళ్ల నిండే యువతకు ఓటు హక్కు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకొని.. 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారు ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అలానే ఈ నెల 20 నుంచి  ఇప్పటికే ఉన్న ఓటర్ కార్డుల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే అందుకు అవకాశం కల్పించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఓటర్ల నమోదుతో పాటు నకిలీ ఓట్లు, బోగస్ ఓట్ల తొలగింపును కూడా అధికారులు చేపట్టనున్నారు.

ఓటర్ కార్డుల్లో మార్పు, కొత్త ఓటు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి జనవరి 6న ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు. అదేవిధంగా ఓటర్ల తుది జాబితాను ఫిబ్రవరి 8 నాటికి పూర్తి చేసి రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిచంనున్నారంట. ఓటు హక్కు విలువను తెలుపుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునేలే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక ఓటర్ నమోదు ప్రక్రియలో భాగంగా బీఎల్‌ఓలు ఇంటింటినీ తిరిగి వివరాలు సేకరిస్తారు.

ఓటు నమోదు కోసం బీఎల్‌ఓలతో పాటు ఆన్‌లైన్‌లోనూ  అర్హత కలిగిన వారి పేర్లు నమోదు చేసుకోవచ్చు. అర్హులైన యువత ఓటు నమోదు చేసుకునేలా  కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతేకాక ఓటు కోసం కాలేజీల్లోనే అప్లయ్ చేసుకునేలా ప్రోత్సహించనున్నారు. ఇక ఓటుకు సంబంధించి వివిధ ఫారమ్ లు ఉంటాయి. ఎవరికి ఏది అవసరమో ఆ ఫారమ్ ను నింపి.. అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.  దీని కోసం రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, ఆధార్‌ కార్డు జతపరిచి ఇవ్వాల్సి ఉంటుంది. దీనితో పాటు పదో తరగతికి సంబంధించిన ధృవీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది.

ఇక ఓటర్ కార్డులో పేరు, పుట్టిన తేదీల్లో మిస్టేక్స్ ఉంటే.. వాటిని సవరించేందుకు ఫారం-8ను ఉపయోగించాలి. ఇందుకోసం 10వ తరగతి మార్కుల పత్రం లేదా డ్రైవింగ్‌ లైసెన్స్‌ల్లో ఏదో ఒకటి జతపర్చాలి ఉంటుంది. అదేవిధంగా అడ్రస్ మార్చేందుకు 8A ఫామ్ ను వినియోగించాలి. అందులో గత చిరునామాతో ఉన్న గుర్తింపు కార్డు జిరాక్స్‌, ప్రస్తుత చిరునామా ధ్రువీకరణ పత్రాన్ని జత చేసి దరఖాస్తు పెట్టాలి. మరి.. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.