రైతులతో కేంద్రం చర్చలు కొనసాగిస్తూనే ఉంది. శుక్రవారం మరోసారి కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఆ చర్చలకు ముందు ప్రభుత్వానికి సవాల్ విసిరేందుకే అన్నట్లు ఢిల్లీ శివార్లలో రైతన్న ట్రాక్టర్లతో కదం తొక్కాడు. వేల మంది రైతులు పంజాబ్, హరియాణా, ఢిల్లీ శివార్ల నుంచి నాలుగు మార్గాల మీదుగా దాదాపు 3,500 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీశారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్తో 43 రోజులుగా చలి, […]
కాలానికి లెక్కలు తెలియవు. తేదీలు, సంవత్సరాలు మనం కౌంట్ చేయాల్సిందే. అలల్లా కాలం కదులుతూనే వుంటుంది. కొత్త ఏడాది వచ్చి రెండు రోజులైంది. ఏమీ జరగదు, ఏదీ అంత సులభంగా మారదు, కానీ ఏదో ఆశ. నా చిన్నతనంలో అన్ని రోజుల్లానే జనవరి ఫస్ట్ కూడా. మామూలు జనం పట్టించుకునే వాళ్లు కాదు. 1971 జనవరి ఫస్ట్ నాటికి నేను ఐదో తరగతి. న్యూ ఇయర్ అని మా చిన్నాన్న కొంచెం హడావుడి చేశాడు. అప్పటికి ఆయన […]
కేంద్రంలో వ్యవసాయ బిల్లులకు కట్టుబడి ఉన్నామని చెబుతున్న కమలదళం కేరళలో మాత్రం భిన్నంగా స్పందించింది. తాజాగా వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి సంఘీభావంగా కేరళ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమయ్యింది. ఆ మూడు చట్టాల అమలుని వ్యతిరేకిస్తూ తీర్మానం ఆమోదించారు. సహజంగా కేరళలో అధికార లెఫ్ట్, విపక్ష కాంగ్రెస్ పార్టీలు జాతీయ స్థాయిలో కూడా వాటిని వ్యతిరేకిస్తున్నందున ఆ రెండు పక్షాలు రైతులకు అనుకూలంగా ఓట్లేయడంలో పెద్ద విశేషం లేదు. కానీ అనూహ్యంగా బీజేపీ కూడా బిల్లులకు […]
దాదాపు 30 రోజులకు పైగా రాజధాని ఢిల్లీలో రైతు ఉద్యమం హోరాహోరీగా కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ తీవ్రమవుతోంది. రైతుల రాక పెరుగుతోందని, ఆ సంఖ్య ఇంకా పెరిగితే కట్టడి కష్టమని ఓ దశలో పోలీసులు కూడా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రోజూ వందల మంది వచ్చి ఉద్యమంలో చేరుతున్నారు. కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలోని నాసిక్ నుంచి 3వేల మంది రైతులు బైక్లు, చిన్న చిన్న క్యాబ్ల్లో ఢిల్లీకి యాత్రగా వచ్చారు. రైతులకు కేంద్రం మరోసారి వర్తమానం […]