నాని నటించిన “అంటే సుందరానికి” సినిమాపై అందరూ చెప్తున్న ప్రధాన కంప్లైంట్ ఒక్కటే.. అదే సినిమా రన్ టైమ్. సినిమాను సాగదీశారు అంటూ దాదాపు పదిమంది ప్రేక్షకుల్లో 7-8 మంది ప్రేక్షకులు చెప్తున్నారు. దీనిపై దర్శకుడు వివేక్ ఆత్రేయ తాజాగా స్పందించారు. సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ వేదికగా వివేక్ ఈ అంశంపై మాట్లాడారు. రన్ టైమ్ ను తగ్గించే ఆలోచనే లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను ఇంత నిడివిలోనే చెప్పాలని బృందమంతా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. […]
నిన్న విడుదలైన అంటే సుందరానికి డీసెంట్ రిపోర్ట్స్ వచ్చాయి. ఓపెనింగ్స్ భీభత్సంగా రాలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాని మార్కెట్ కు తగ్గట్టే ఉన్నాయి. కాకపోతే చాలా చోట్ల ఎంసిఏని ఫస్ట్ డే దాటలేకపోవడం మైనస్సే. ఓవర్సీస్ లోనూ ప్రీమియర్ కలెక్షన్ మేజర్ కన్నా తక్కువే ఉంది. ఈ నేపథ్యంలో సుందరానికి మౌత్ టాక్ చాలా కీలకంగా మారనుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఇచ్చే రివ్యూలు రాబోయే రెండు మూడు రోజులను ప్రభావితం చేయబోతున్నాయి. బాగానే ఉందంటూనే […]
సౌత్ లో నజ్రియాకు ఉన్న క్రేజే వేరు. ఏ భాషలో సినిమా చేసినా అక్కడ ఆమెకంటూ ఫ్యాన్స్ ఉంటారు. సహజ నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అయితే దాదాపుగా పదేళ్ళ నుంచి హీరోయిన్ గా చేసినా, సినిమాల సంఖ్య చాలా తక్కువ. పైగా మధ్యలో బ్రేక్ లు ఎక్కువ. దీనికి గల కారణాన్ని చెప్పింది నజ్రియా. ప్రతి సినిమా తరువాత బ్రేక్ తీసుకోవాలని ఫిక్స్ అవుతుందట నజ్రియా. పాపం అది కాస్తా రండేళ్ళు అయిపోతుందట. బ్రేక్ తీసుకున్న […]
న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన అంటే సుందరానికి జూన్ 10న విడుదల కాబోతోంది. ఇవాళ ఏఎంబి మాల్ వేదికగా టీజర్ లాంచ్ ని గ్రాండ్ గా చేశారు. నిడివి మాత్రం ట్రైలర్ అంత ఉంది. అంటే మరొకటి వచ్చే నెల వదులుతారేమో చూడాలి. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురాతో ప్రేక్షకుల మెప్పు పొందిన వివేక్ ఆత్రేయ టేకింగ్ మీద హోమ్ ఆడియన్స్ లో మంచి గురి ఉంది. అందులోనూ నాని మూవీ కావడంతో […]
టాలీవుడ్ లో రిలీజ్ డేట్ల జాతర జరుగుతోంది. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కాక ఒక్కొక్కరు రెండేసి తేదీలను ప్రకటించేస్తున్నారు. రాజమౌళి ఈ ట్రెండ్ ని మొదలుపెట్టగా ఇప్పుడు అందరూ దాన్ని ఫాలో అవుతున్నారు. భీమ్లా నాయక్, గని, రామారావు ఆన్ డ్యూటీ ఆల్రెడీ ఆ పని చేసేయగా నాని కొత్త సినిమా అంటే సుందరానికి ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా 7 డేట్లను అనౌన్స్ చేసి ఈ ట్రెండ్ మీద గట్టి సెటైర్ వేసింది. […]