iDreamPost
android-app
ios-app

అందుకే ఎక్కువ సినిమాలు చేయను – నజ్రియా 

అందుకే ఎక్కువ సినిమాలు చేయను – నజ్రియా 

సౌత్ లో నజ్రియాకు ఉన్న క్రేజే వేరు. ఏ భాషలో సినిమా చేసినా అక్కడ ఆమెకంటూ ఫ్యాన్స్ ఉంటారు. సహజ నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అయితే దాదాపుగా పదేళ్ళ నుంచి హీరోయిన్ గా చేసినా, సినిమాల సంఖ్య చాలా తక్కువ. పైగా మధ్యలో బ్రేక్ లు ఎక్కువ. దీనికి గల కారణాన్ని చెప్పింది నజ్రియా.

ప్రతి సినిమా తరువాత బ్రేక్ తీసుకోవాలని ఫిక్స్ అవుతుందట నజ్రియా. పాపం అది కాస్తా రండేళ్ళు అయిపోతుందట. బ్రేక్ తీసుకున్న సమయంలో తనకు సినిమాలు చేసే మూడ్ ఉండదని చెప్తోంది ఈ భామ. అయితే ఆ సమయంలో తాను స్క్రిప్ట్ లు వింటానని అంటోంది.

వ్యక్తగత జీవితానికి నజ్రియా ఇచ్చే ప్రాధాన్యత ఎక్కువ. ముఖ్యంగా కొన్నిసార్లు ట్రావెలింగ్ లో ఉంటుంది. కేవలం ఈ ఒక్క కారణం వల్లే తన సినిమాల సంఖ్య చాలా తక్కువని చెప్తోంది. పైగా స్క్రిప్ట్ లను చాలా ఆచి తూచి ఎంపిక చేస్తానని, అందుకే చాలా తక్కువ మంది తనకు కథలు వినిపిస్తారని అంటోంది.

తను తీసుకునే బ్రేక్స్ చూసి ప్రేక్షకులు కూడా కమ్ బ్యాక్ సినిమా అని చెప్పడం మానేశారని సరదాగా చెప్పుకొచ్చింది. ఎన్నిసార్లు సినిమాల మధ్య విరామం తీసుకున్నా తెరపై తనని చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని, తన సినిమాలు ఏ టైంలో వచ్చినా ఆదరించి, ఎంజాయ్ చేస్తున్నారని పేర్కొంది.

ఈ సినిమా తరువాత నజ్రియా మళ్ళీ  టాలీవుడ్ లో వరుసపెట్టి సినిమాలు చేస్తుందా అంటే డౌటే. 2013 నుంచి హీరోయిన్ గా సినిమాలు చేస్తున్నా, మధ్యలో బ్రేక్ తరువాత 2018 లోనే మళ్ళీ తెరపై కనిపించింది. ఆ తరువాత 2020లో మరొక సినిమా. మధ్యలో రెండేళ్ళ విరామం. ఇప్పుడు మరోసారి నానితో జతకట్టింది. ఇలా తన వ్యక్తిగత జీవితం కోసం విరామం తీసుకుంటూ సినిమాల్లో నటిస్తోంది నజ్రియా.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom