పవన్ కల్యాణ్ సినిమా భీమ్లానాయక్ విడుదలైన థియేటర్ల వద్ద ప్రభుత్వ సిబ్బందిని నియమించడం బాధాకరమని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహార్ చేసిన వ్యాఖ్యలు మరీ విడ్డూరంగా ఉన్నాయి. సినిమాకు వచ్చేవారిని భయభ్రాంతులకు గురిచేసేందుకు ఉద్యోగులను థియేటర్ల వద్ద ఉంచారని ఆయన ఆరోపించడాన్ని వైఎస్సార్ సీపీ నేతలు ఖండిస్తున్నారు. శనివారం మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ధియేటర్ల వద్ద కర్ఫ్యూలాంటి వాతావరణం తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్మోహనరెడ్డికే దక్కిందన్నారు. ప్రభుత్వం సామాన్యుల పక్షం వహించి సినిమా […]
జనసేన నేత, ఆ పార్టీ పొలిటికల్ అఫైర్ కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ తాజాగా చేసిన వ్యాఖ్యలను గమనిస్తే.. జనసేన పార్టీ నడుపుతోంది పవన్ కళ్యాణ్ నటించే సినిమాల కోసం అన్నట్లుగా ఉంది. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి, అవసరమైనప్పుడు లేదా సమయం దొరికినప్పుడు కార్యక్రమాలు చేస్తూ.. సినిమా విడుదలైనప్పుడు ప్రేక్షకుల ఉత్సాహాన్ని సొమ్ము చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాజకీయ పార్టీ ఉపయోగించుకోవాలన్నట్లుగా ఉంది జనసేన నేతల తీరు. భీమ్లా నాయక్ సినిమా విడుదలైన సందర్భంగా […]
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో జనసేన, బీజేపీ కూటమి తరఫున ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారనే విషయంపై రెండు రోజుల క్రితం క్లారిటీ ఇచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ వ్యవహారం వెనుక అసలు విషయాన్ని ఈ రోజు వెల్లడించారు. తిరుపతిలో బీజేపీ అభ్యర్థే పోటీ చేస్తారని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసినప్పుడే డిసైడ్ అయిందని సోము పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్, […]
రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. అందుకే రాజకీయాల్లో సాధ్యం కానిది ఏదీ లేదంటారు. ఈ క్రమంలోనే అంతుచిక్కని అంశాలు చాలా ఉంటాయి. అలాంటి అంతుచిక్కని అంశాలలో ప్రస్తుతం బీజేపీ, జనసేన పార్టీల మధ్య ఉన్న పొత్తు కూడా ఒకటి. 2019 సాధారణ ఎన్నికలలో వేర్వేరుగా పోటీ చేసిన బీజేపీ, జనసేన పార్టీలు.. ఎన్నికలు ముగిసిన తర్వాత కొద్ది నెలలకే పొత్తు పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత పొత్తు వల్ల ప్రయోజనం ఏమిటన్నవారికి.. […]
పవన్ కళ్యాణ్ కొంతకాలం క్రితం తెలుగు సినిమా తెరపై దేదీప్యమానంగా వెలుగొందిన తార.. ఆయన అభిమానులు ఆయన్ని దేవుడిగా భావిస్తారు. తాము పవన్ కళ్యాణ్ భక్తులమని అనేక సందర్భాల్లో రుజువు చేసారు. కొన్నాళ్ళు పరాజయాలు వెక్కిరించినా పవన్ అభిమానులు పెరిగారే కానీ తగ్గలేదు. పవన్ విద్యార్హతల విషయానికి వస్తే చదువుల్లో అంతగా రాణించలేదు. ఇంటర్మీడియట్ తో పాటు పదవ తరగతి పరీక్షల్లో కూడా ఫెయిల్ అయ్యాడు. కానీ 1984 లో నాదెండ్ల భాస్కర రావు, తెలుగుదేశం పార్టీ […]
జనసేన పార్టీకి మాజీ సిబిఐ జేడీ లక్ష్మి నారాయణ రాజీనామా పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. రాజీనామాకు ఆయన చెప్పిన కారణం కూడా పెద్ద సహేతుకమైనది కాకపోవచ్చు. బహుశా బయటకు చెప్పలేని/చెప్పకూడని వేరే ఏవైనా బలమైన కారణాలు కూడా ఉండి ఉండవచ్చు. బయటకు తెలియని కారణాలు ఏవైనా కావచ్చు కానీ ఎన్నికలు ముగిశాక ఆయన పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో కానీ, పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో కానీ పెద్దగా కనబడలేదు, వినబడలేదు లేదా […]
జనసేన అధినేత తడవకో పార్టీతో పొత్తు పెట్టుకొన్నప్పుడో , క్రియాశీలంగా మారినప్పుడో , స్తబ్దుగా ఉన్నప్పుడో , ఎన్నికలప్పుడో , ఎన్నికలు ఏమీ లేక సినిమాలు చేస్తున్నప్పుడో ఇలా ప్రతి సందర్భంలో ఎవరో ఒక సీనియర్ నేత రాజీనామా చేయడం పరిపాటి అయిపోయింది. ఈక్రమంలో భాగంగా ఈ రోజు జనసేన కీలక నేత గత ఎన్నికల్లో వైజాక్ నుండి ఎంపీ గా పోటీ చేసిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ vv లక్ష్మీనారాయణ సైతం రాజీనామా చేశారు. తన […]
అమరావతి లో భూములిచ్చిన రైతులకు సంఘీభావంగా ఫిబ్రవరి 2 న ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్న సీతానగరం లాకుల నుంచి బందరు రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా తలపెట్టిన లాంగ్ మార్చ్ కార్యక్రమం వాయిదా పడింది. అయితే ఈ లాంగ్ మార్చ్ నిర్వహించబోయే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఇరు పార్టీలు ప్రకటించాయి. రాజధాని కోసం భూములను త్యాగం చేసిన అమరావతి ప్రాంత గ్రామాల రైతుల కోసం ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 2 […]
అంతన్నాడింతన్నాడో పవన్ బాబు….!!! ఢిల్లీ ఎల్లి సల్లగైపోనాడో పవన్ బాబు .. సోమరిపోతుకు సోకులెక్కువ …పని రానివాడికి మాటలెక్కువ అన్న సామెత జనసేన అధినేత పవర్ కళ్యాణ్ కు సరిగ్గా సరిపోయేలా ఉంది. తాను లేస్తే మనిషిని కాను. తాట తీస్తా..తెగిస్తే పీక కోస్తా లేదా తలా తెగేసుకుంటా అంటూ నిమిషానికోతీరుగా మాట్లాడే పవన్ కు తాజాగా జ్ఞాన నేత్రం తెరుచుకున్నట్లుంది. అమరావతిని ఎవరు కదిలిస్తారో చూస్తా..అంగుళం కదిల్చినా కాటమారాయుడి కత్తికి పని చెప్తా అనే పవన్ కళ్యాణ్ […]
నిన్న బీజేపీ జనసేనల మీటింగులో పాల్గొన్న నాయకులు గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాంగ్రెస్ అభిమాని ట్రోల్… నాదెండ్ల మనోహర్@వెన్నుపోటు కాంగ్రెస్ కన్నా లక్ష్మీనారాయణ @ బత్తాయి కాంగ్రెస్ పురందేశ్వరి @ కూతురు కాంగ్రెస్ పవన్ కళ్యాణ్ @ తమ్ముడు కాంగ్రెస్ సుజనా చౌదరి కూడా పిలిచి ఉంటే@ తెలుగు కాంగ్రెస్ కూడా ఉన్నట్టయేది ఖర్మరా బాబు, ఇలాంటి products ఇచ్చింది మా కాంగ్రెస్ ఫ్యాక్టరీ..