iDreamPost
android-app
ios-app

లేడి సూపర్ స్టార్ విజయశాంతి చేతుల మీదుగా “దక్కన్ సర్కార్” సినిమా పోస్టర్ విడుదల

  • Published Oct 09, 2025 | 6:00 PM Updated Updated Oct 09, 2025 | 6:00 PM

తెలంగాణ ఉద్యమకారుడు ప్రముఖ రచయిత కళా శ్రీనివాస్ గారు ప్రతిష్టత్మాకంగా నిర్మించిన "దక్కన్ సర్కార్" సినిమాకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కార్యక్రమం బంజారాహిల్స్ రోడ్ no 12 లో జరిగింది..లేడి సూపర్ స్టార్, తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్సీ శ్రీమతి విజయశాంతి గారు ఈ పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది..ఈ కార్యక్రమంలో మరో సీనియర్ ఉద్యమకారుడు, కళాకారుల జేఏసీ అధ్యక్షుడు మురళీధర్ దేశ్ పాండే, చిత్ర హీరో చాణక్య, మరో లీడ్ యాక్ట్రెస్ మౌనిక పాల్గొన్నారు..

  • Published Oct 09, 2025 | 6:00 PMUpdated Oct 09, 2025 | 6:00 PM
లేడి సూపర్ స్టార్ విజయశాంతి చేతుల మీదుగా  “దక్కన్ సర్కార్” సినిమా పోస్టర్ విడుదల

తెలంగాణ ఉద్యమకారుడు ప్రముఖ రచయిత కళా శ్రీనివాస్ గారు ప్రతిష్టత్మాకంగా నిర్మించిన “దక్కన్ సర్కార్” సినిమాకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కార్యక్రమం బంజారాహిల్స్ రోడ్ no 12 లో జరిగింది..లేడి సూపర్ స్టార్, తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్సీ శ్రీమతి విజయశాంతి గారు ఈ పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది..ఈ కార్యక్రమంలో మరో సీనియర్ ఉద్యమకారుడు, కళాకారుల జేఏసీ అధ్యక్షుడు మురళీధర్ దేశ్ పాండే, చిత్ర హీరో చాణక్య, మరో లీడ్ యాక్ట్రెస్ మౌనిక పాల్గొన్నారు..

విజయశాంతి గారు మాట్లాడుతూ..
ప్రజా ఉద్యమాలతో సంబంధం ఉన్న రచయిత, ప్రజాకళాకారుడు కళా శ్రీనివాస్ నిర్మిస్తున్న దక్కన్ సర్కార్ సినిమా ప్రజల్లోకి వెళ్లాలని, చిత్ర విజయానికి తన వంతు కృషి చేస్తానని సినిమా అప్డేట్స్ చూస్తే ఈ సినిమా విజయవంతం అవుతుందని 100 మంది ఆర్టిస్టులు, 50 మంది టెక్నిషియన్ల కృషి ఈ సినిమాకు ఉందని.. తెలంగాణ ప్రాంతం నుండి ఇలాంటి మరిన్ని చిత్రాలు రావాలని.. దానికి ప్రభుత్వం కూడా సహకరిస్తుందని తెలపడం జరిగింది..

మురళీధర్ దేశ్ పాండే మాట్లాడుతూ..
తెలంగాణ అస్తిత్వానికి అద్దం పట్టే ఇలాంటి సినిమాల నిర్మాణం జరగాలని..ప్రభుత్వం తెలంగాణ సినిమాలను, కళాకారులను ప్రోత్సహించాలని కోరుతూ చిత్ర యూనిట్ ను అభినందించారు..
చిత్ర దర్శకుడు, నిర్మాత కళా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇది ప్రజల జీవన స్థితిగతుల కథ అని, సహజ సంఘటనలను బేస్ చేసుకొని సహజ సిద్ధంగా నిర్మించిన చిత్రం అని, 2 సంవత్సరాలు కష్టపడి ఎన్నో ఒడుదొడుకులు తట్టుకొని పూర్తి చేశామని, ఈ సినిమాని తన అభిమాన తార విజయశాంతి గారు ప్రమోషన్ చెయ్యడం తనకు ఎంతో గొప్పగా అనిపించింది అని విజయశాంతి గారికి, మిగతా అతిధులకు చిత్ర హీరో, హీరోయిన్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు..

చిత్ర ప్రధాన నటుడు చాణక్య మాట్లాడుతూ ఈ సినిమా కోసం నేను చాలా యాస, భాష గ్రామీణ పరిస్థితులు హావభావాలు ఇలా చాలా నేర్చుకున్నానని, ఈ చిత్ర విజయం మాకు అవసరం అని, దానికి ప్రజల ఆశీర్వాదం కావాలని ఈ సందర్భంగా సినిమా పోస్టర్ రిలీజ్ చేసి సినిమాకు మద్దతుగా నిలిచిన విజయశాంతి గారికి, సినిమా నిర్మాత, దర్శకుడు కళా శ్రీనివాస్ గారికి, మౌనిక గారికి, దేశ్ పాండే గారికి కృతజ్ఞతలు తెలిపారు.

మరో నటి మౌనిక మాట్లాడుతూ..
ఈ సినిమాలో నాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన సుమారు 40 మంది కళాకారులు పాల్గొన్నారు.

పి.ఆర్.ఓ : దయ్యాల అశోక్ , కడలి రాంబాబు