iDreamPost
android-app
ios-app

పవన్ కి షాకిచ్చిన నాదేండ్ల మనోహర్ తండ్రి.. మళ్లీ జగనే సీఎం అంటూ వ్యాఖ్యలు!

పవన్ కి షాకిచ్చిన నాదేండ్ల మనోహర్ తండ్రి.. మళ్లీ జగనే సీఎం అంటూ వ్యాఖ్యలు!

నాదేండ్ల భాస్కరరావు.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన.. అప్పటి రాజకీయాల్లో చక్రం తిప్పారు. రాజకీయ రంగంలో తనదైన ముద్రవేసి కీలక నేతగా కొనసాగారు. మరో విషయం ఏంటంటే? అప్పట్లో ఎన్టీఆర్ ను సైతం ఢీ కొట్టి ముఖ్యమంత్రి కూర్చీని సంపాదించుకున్న చరిత్ర ఆయనది. ఇదిలా ఉంటే.. ఆయన కుమారుడు నాదేండ్ల మనోహర్ ప్రస్తుతం జనసేన పార్టీలో కీలక స్థానంలో కొనసాగుతున్నారు. పార్టీలో పవన్ తర్వాత ముఖ్యనేతగా కొనసాగుతున్నారు మనోహర్. పార్టీ వ్యవహారాలను చూసుకుంటూ ఎప్పటికప్పుడు పవన్ కు రాజకీయంగా సలహాలు, సూచలను ఇస్తూ జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు.

అయితే, ఆయన తండ్రి భాస్కరరావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న ఆయన.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇక తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నా కుమారుడు నాదేండ్ల మనోహర్ బాగా చదువుకున్నవాడు, చాలా తెలివైన వాడు కూడా. వాడు మొదట్లో రాజకీయాల్లోకి వస్తానంటే వద్దు.. ఇదో పెద్ద బూతు అని చెప్పాను. వాడు నా మాట వినలేదు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి స్పీకర్ గా కూడా రాణించాడు.

ఇక ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు చూస్తుంటే మళ్లీ జగనే సీఎం అవుతారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. నిమ్న జాతులు అంతా జగన్ వెంటే నడుస్తున్నారు. రెడ్డి, కమ్మ వేరైనా బ్రాహ్మణ, వైశ్య మిగిలిన వాళ్లంతా జగన్ తోనే ఉన్నారు. వాళ్లందరూ చంద్రబాబును ఇష్టపడరు. ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే.. ఒకర్నొకరు చంపుకునేట్టు ఉన్నారు అంటూ నాదెండ్ల భాస్కరరావు చెప్పుకొచ్చారు. కాగా, జనసేన పార్టీకి కీలక నేతగా ఉన్న నాదేండ్ల మనోహర్ తండ్రి జగన్ ను పొగుడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విశేషం.

ఇది కూడా చదవండి: సోషల్ మీడియాలో CM జగన్ క్రేజ్! ట్రెండింగ్ లో #YSJaganAgain

marsbahis girişjojobet